Coriander Seeds For Gas : గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకాన్ని.. సెకండ్లలో మాయం చేసే అద్భుతమైన చిట్కా..!

Coriander Seeds For Gas : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, మ‌సాలాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం,జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల బారిన మ‌న‌లో చాలా మంది ప‌డుతున్నారు. నేటి త‌రుణంలో ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌గానే చాలా మంది మందుల‌ను వాడుతున్నారు. అయితే దీర్ఘ‌కాలం పాటు మందులు వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఇత‌ర దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్ద చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈచిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ధ‌నియాల‌ను, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను, 4 మిరియాల‌ను, 4 ల‌వంగాల‌ను, చిటికెడు ప‌సుపును వేయాలి. త‌రువాత ఈ నీటిని స్ట‌వ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌షాయాన్ని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయాన్ని రోజుకు ఒక‌టి నుండి రెండు సార్లు తీసుకోవ‌చ్చు. అలాగే దీనిని ఎవ‌రైనా కూడా తీసుకోవ‌చ్చు.

Coriander Seeds For Gas how to use this for problem
Coriander Seeds For Gas

ఈ విధంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్య‌ల నుండి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ స‌మ‌స్య త‌లెత్తిన వెంట‌నే ఈ క‌షాయ‌న్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. వారానికి క‌నీసం రెండు రోజుల పాటు ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ క‌షాయాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి గుండె జ‌బ్బులు క‌డా రాకుండా ఉంటాయి.

అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల క‌డుపులో ఉండే పురుగులు న‌శిస్తాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శ‌రీరంలో వేడి త‌గ్గుతుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా ఇంట్లోనే క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts