Cracked Heels : శీతాకాలంలో చాలామంది చర్మం పాడైపోతుంది. చర్మం డ్రై అయిపోవడం, పాదాలకి పగుళ్లు రావడం. ఇలా, శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్లు కూడా ఒకటి. చలి కారణంగా పాదాలకి పగుళ్లు వస్తుంటాయి. కొంతమందికి పాదాలు మంటలు, నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే, ఈ సమస్యతో మీరు కూడా సతమతమవుతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. ఇలా చేసినట్లయితే పగుళ్లు తగ్గిపోతాయి. పాదాలు అందంగా మారుతాయి.
రెండు స్పూన్లు ఆవాల నూనె తీసుకోండి. అలానే రెండు స్పూన్లు కొబ్బరి నూనె కూడా తీసుకోండి. కొద్దిగా వ్యాజిలిన్, విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా పక్కన పెట్టుకోండి. చిన్న కర్పూరాన్ని కూడా తీసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆవాల నూనె, రెండు స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోండి. తర్వాత కర్పూరాన్ని కూడా వేసుకుని మిక్స్ చేయండి. వ్యాజిలిన్, విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
వీటన్నిటిని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక, మడమలకు రాసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే, నిల్వ ఉంటుంది. రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు దీన్ని మీ పాదాలకి రాసుకున్నట్లయితే, త్వరగా పగుళ్లు తగ్గిపోతాయి.
నొప్పులు వంటివి కూడా ఉండవు. వాపులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. పగుళ్ల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పగుళ్లు కోసం ఏవేవో క్రీములు ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నచ్చిన నూనెలను రాసేస్తూ ఉంటారు. వీటన్నిటి వలన మీకు ఫలితం కనపడకపోయినట్లయితే, శీతాకాలంలో మడమల పగుళ్ళ నుండి బయటపడడానికి చిన్న చిట్కాని ట్రై చేయండి. సరిపోతుంది.