Curry Leaves And Onion For Hair : ఈ రెండు క‌లిపి రాస్తే.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా..!

Curry Leaves And Onion For Hair : ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, జుట్టు పొడి బార‌డం, జుట్టు చిట్ల‌డం వంటి వాటిని మ‌నం జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లుగాచెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని జుట్టు స‌మ‌స్య‌లు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు అందంగా క‌న‌బ‌డాల‌ని మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల నూనెల‌ను, షాంపుల‌ను, హెయిడ్ డైల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గ‌క‌పోగా దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

ఈ జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటిని కూడా మ‌నం ఒక చిన్న ఇంటి చిట్కాను ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా క‌ల‌గ‌కుండా ఉంటాయి. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా మ‌నం క‌రివేపాకును ఉప‌యోగించాల్సి ఉంటుంది. క‌రివేపాకులో మ‌న జుట్టుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి.

Curry Leaves And Onion For Hair works effectively know how to use it
Curry Leaves And Onion For Hair

జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా చేయ‌డంలో, జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో, జుట్టును న‌ల్ల‌గా చేయ‌డంలో క‌రివేపాకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే ఈ చిట్కా త‌యారీలో ఉప‌యోగించాల్సిన మ‌రో ప‌దార్థం ఉల్లిపాయ‌. ఉల్లిపాయ‌లో స‌ల్ఫ‌ర్ అధికంగా ఉంటుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల జుట్టుకు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ చ‌క్క‌గా జ‌రిగి జుట్టు కుదుళ్లు ధృడంగా త‌యార‌వుతాయి. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చ‌డంలో, జుట్టు రాల‌డాన్ని తగ్గించ‌డంలో ఉల్లిపాయ మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. క‌రివేపాకుతో అలాగే ఉల్లిపాయ‌ల‌తో జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక జార్ లో క‌రివేపాకును వేసి మెత్త‌గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి పేస్ట్ గా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ నుండి ఉల్లిపాయ ర‌సాన్ని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ర‌సాన్ని క‌రివేపాకు మిశ్ర‌మంలో వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. ఇలా ప‌ట్టించిన గంట త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా వారానికి రెండు సార్ల చొప్పున నెల రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు అందంగా, కాంతివంతంగా త‌యారవుతుంది.

Share
D

Recent Posts