Dates Water For Belly Fat : పొట్ట చుట్టూ, నడుము చుట్టూ, తొడలు, పిరుదులు వంటి శరీర భాగాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది బాధపడుతున్నారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల చూడడానికి అంద వికారంగా కనబడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించడం, మార్కెట్ లో దొరికే మందులను, పొడులను వాడడం వంటి రకరకాల పద్దతులను పాటిస్తూ ఉంటారు. కానీ వీటిని పూర్తిగా పాటించలేక మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. మరలా లావు పెరుగుతూ ఉంటారు.
కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చిన్న చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేసే చిట్కా ఏమిటి…దీనిని ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం 4 కర్జూరాలను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక గ్లాస్ నీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో 4 కర్జూరాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత అల్లాన్ని పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. కర్జూరాలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. అలాగే కర్జూరాలల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అదే విధంగా అల్లం కూడా బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లంలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఈ విధంగా అల్లం, కర్జూరాలతో పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఎముకలు ధృడంగా తయారవుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక వక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అధిక బరువు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.