చిట్కాలు

Coconut For Hair : కొబ్బ‌రితో ఇలా చేయండి.. మీ జుట్టు ఉక్కులా స్ట్రాంగ్‌గా మారుతుంది..!

Coconut For Hair : ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ కాలుష్యం, జీవనశైలి అలాగే జుట్టుకి సరైన పోషణ లేకపోవడం.. ఇలా అనేక కారణాల వలన జుట్టు బాగా రాలిపోతోంది. పైగా చుండ్రు మొదలైన సమస్యలను కూడా ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలను తగ్గించాలంటే ఇలా ఇంట్లోనే సులభంగా మీరు దీనిని తయారు చేసుకుని ఉపయోగించినట్లయితే చక్కటి పరిష్కారం కనిపిస్తుంది.

అరకప్పు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా క‌ట్ చేయండి. మిక్సీ జార్ లో వేసి కొంచెం నీళ్లు పోసుకుని పాలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేయండి. రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ కూడా వేయండి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ మిశ్రమాన్ని తీసుకుని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా రాయండి.

do like this to hair to become it strong

ఒక గంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. వారానికి రెండుసార్లు మీరు దీనిని ఉపయోగించినట్లయితే జుట్టు రాలే సమస్య ఉండదు. చుండ్రు కూడా బాగా తగ్గిపోతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. స్మూత్ గా ఉంటుంది. షైనీగా ఉంటుంది. జుట్టు కుదుళ్ళకి చక్కటి పోషణ ల‌భిస్తుంది.

కొబ్బరి పాలలో ఉండే విటమిన్స్ జుట్టు మూలాల నుండి బలోపేతం చేస్తాయి. జుట్టు చిట్లిపోవడం వంటి బాధలు కూడా ఉండవు. దురద పెట్టడం, జుట్టు రాలడం వంటివి కూడా తగ్గిపోతాయి. కాబట్టి వారానికి రెండు సార్లు మీరు దీన్ని పాటించండి. ఇక మీ కురులు చాలా అందంగా మారుతాయి. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం ఇలా ఏ సమస్యా కూడా మీకు రాదు.

Admin

Recent Posts