Drink For Migraine : ఈ డ్రింక్ తాగితే చాలు.. ఒక్క నిమిషంలో మీ మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయం అవుతుంది..

Drink For Migraine : మ‌న‌లో చాలా మంది వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మైగ్రేన్ త‌ల‌నొప్పి కూడా ఒక‌టి. ఒత్తిడి, ఆందోళ‌న‌, ఎక్కువ‌గా ఆలోచించ‌డం, డిఫ్రెష‌న్ వంటి కార‌ణాల చేత ఈ త‌ల‌నొప్పి ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే స్త్రీల‌ల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పురుషుల్లో కంటే స్త్రీల‌ల్లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తుంది. మైగ్రేన్ కార‌ణంగా శ‌బ్దాల‌ను అస్స‌లు విన‌లేక‌పోవ‌డం, వెలుతురును చూడ‌లేక‌పోవ‌డం, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అయితే మ‌న ఇంట్లోనే ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మైగ్రేన్ త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. మైగ్రేన్ ను త‌గ్గించే ఈ ఆయుర్వేద పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో అర చెంచా దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ నీటిని 100 ఎమ్ ఎల్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు చ‌ల్లార్చాలి. నీళ్లు గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఇందులో 5 నుండి 6 చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి తాగాలి. మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఈ పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల న‌రాల్లో ఉండే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గి వెంట‌నే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

Drink For Migraine know how to make and take
Drink For Migraine

అలాగే ప్ర‌తిరోజూ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టేబుల్ స్పూన్ అల్లం ర‌సం క‌లిపి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మైగ్రేన్ స‌మ‌స్య త‌గ్గుతుంది. అదే విధంగా ఒక ఆపిల్ ముక్క మీద ఉప్పును చ‌ల్లుకుని తిన‌డం వ‌ల్ల కూడా మైగ్రేన్ స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే ప్ర‌తిరోజూ యోగా, ఆస‌నాలు వంటి చేస్తూ ఉండాలి. వీటి వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా మ‌నం మైగ్రేన్ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Share
D

Recent Posts