Ear Cleaning : ఇదిగో.. ఇలా చేస్తే చెవుల్లోని గులిమి మొత్తం బయటకు వచ్చేస్తుంది.. చెవులు క్లీన్ అవుతాయి..!

Ear Cleaning : చెవుల్లో గులిమి పేరుకుపోవ‌డం అన్న‌ది స‌ర్వ సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. ప్ర‌తి ఒక్క‌రికీ ఇలాగే జ‌రుగుతుంటుంది. అయితే కొంద‌రికి గులిమి మ‌రీ ఎక్కువ‌గా త‌యారై ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే చెవుల్లో మాటిమాటికీ దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారు కాట‌న్ బ‌డ్స్ తో గులిమి తీస్తుంటారు. కానీ వాటికి బ‌దులుగా కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌వ‌చ్చు. దీంతో గులిమిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌వ‌చ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

Ear Cleaning tip use these remedies to remove ear wax

ఒక చిన్న గ్లాస్‌లో 60 ఎంఎల్ మోతాదులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత డ్రాప‌ర్ స‌హాయంతో ఒక్కో చెవిలో 5 నుంచి 10 చుక్క‌లు ఆ మిశ్ర‌మాన్ని వేయాలి. అనంత‌రం ఒక గంట సేపు అయ్యాక శుభ్ర‌మైన నీళ్ల‌తో చెవుల‌ను క‌డిగేయాలి. ఇలా 2 రోజుల‌కు ఒక‌సారి చేయాలి. చెవి మొత్తం శుభ్రం అయిందని అనుకునే వ‌ర‌కు 2 రోజుల‌కు ఒక‌సారి ఇలా చేయ‌వ‌చ్చు. అయితే 4 సార్లు ఈ విధంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ సార్లు ఈ చిట్కాను ట్రై చేయ‌కూడ‌దు. అవ‌స‌రం అనుకుంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి.

ఇక బేకింగ్ సోడాకు బ‌దులుగా కొబ్బ‌రినూనె లేదా ఆలివ్ నూనెను వాడ‌వ‌చ్చు. ఏదైనా ఒక నూనె తీసుకుని 5 నుంచి 10 చుక్క‌ల‌ను ఒక్కో చెవిలోనూ వేయాలి. ఒక గంట సేపు అయ్యాక క‌డిగేయాలి. ఈ చిట్కాను రోజూ.. ఎన్ని రోజుల వ‌ర‌కైనా పాటించ‌వ‌చ్చు. ఇది సుర‌క్షిత‌మైన ప‌ద్ధ‌తి.

అలాగే హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ మిశ్ర‌మాన్ని కూడా చెవుల‌ను క్లీన్ చేసేందుకు వాడ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని కూడా 5 నుంచి 10 చుక్క‌ల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి. కానీ కేవ‌లం 5 నిమిషాలే ఉంచాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా 14 రోజుల్లో 3 సార్లు చేయ‌వ‌చ్చు. దీంతో చెవుల్లోని గులిమి పోతుంది. చెవులు శుభ్ర‌మ‌వుతాయి. చెవుల్లో ఉండే దుర‌ద త‌గ్గుతుంది.

Admin

Recent Posts