Anasuya : అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయిందా..? ఏం జ‌రుగుతోంది..?

Anasuya : జ‌బ‌ర్ద‌స్త్ షో అంటే.. మొద‌ట్నుంచీ వివాదాల‌కు కేరాఫ్‌గా మారింది. ఎప్పుడూ ఈ ప్రోగ్రామ్‌కు చెందిన విష‌యాలు చ‌ర్చ‌నీయాంశం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్‌లో బూతు ఎక్కువ‌గా ఉంటుంద‌ని మొద‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం ఈ షోకు రేటింగ్స్ స‌రిగ్గా రావ‌డం లేదు. దీంతో ఈ షో నుంచి కొంద‌రు టీమ్ లీడ‌ర్స్ బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నార‌ని గ‌తంలో ప్రోమోల్లో చూపించారు. తీరా విష‌యం తెలిసి అదంతా ప‌బ్లిసిటీ కోసం చేసింద‌ని వెల్ల‌డి కావ‌డంతో.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

is Anasuya left jabardasth what is happening

గ‌తంలోనూ ఓసారి ఇలాగే చేశారు. అయితే ఈ సారి ప్రోమోలో మ‌రీ ఎమోష‌న‌ల్‌గా చూపించ‌డంతో సుడిగాలి సుధీర్ టీమ్ నిజంగానే జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెట్టారంటూ.. అంద‌రూ న‌మ్మారు. కానీ అది వ‌ట్టిదే అని తేలింది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఇలాంటి వార్తే వైర‌ల్ అవుతోంది. ఈసారి జ‌బ‌ర్ద‌స్త్ నుంచి అన‌సూయ వెళ్లిపోయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు తాజాగా విడుద‌లైన ప్రోమోను ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.

తాజాగా విడుద‌లైన ప్రోమోలో ర‌ష్మి క‌నిపించింది. అన‌సూయ క‌నిపించ‌లేదు. దీంతో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయింద‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈవిష‌యం వైర‌ల్ అవుతోంది.

అన‌సూయ ఇటీవ‌లే పుష్ప మూవీలో దాక్షాయ‌ణి పాత్ర‌లో న‌టించింది. అయితే సినిమాల్లో వ‌స్తున్న ఆఫ‌ర్ల వ‌ల్ల క్ష‌ణం కూడా తీరిక‌లేకుండా అన‌సూయ ఉంద‌ని, అందుక‌నే ఈ ఒక్క ఎపిసోడ్‌కు మాత్ర‌మే ఆమె మిస్ అయింద‌ని కొంద‌రు అంటున్నారు. కానీ ఆమె జ‌బ‌ర్ద‌స్త్ ను విడిచిపెట్టిపోయింద‌ని చాలా మంది అంటున్నారు. మ‌రి త‌దుప‌రి ఎపిసోడ్ లో అయినా అన‌సూయ కనిపిస్తుందా.. ఇదంతా వ‌ట్టి పుకారేనా.. అన్న విష‌యాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Editor

Recent Posts