యూక‌లిప్ట‌స్ ఆయిల్ (నీల‌గిరి తైలం)తో క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

యూకలిప్టస్ చెట్లు.. వీటినే నీల‌గిరి చెట్లు అంటారు. ఇవి ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల పెరుగుతాయి. ఈ చెట్టు ఆకుల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆ ఆకుల‌ను ఎండబెట్టి పొడి చేసి దాంతో నూనెను త‌యారు చేస్తారు. ఆ ఆయిల్ కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే యూక‌లిప్ట‌స్ ఆయిల్ (నీల‌గిరి తైలం) వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

eucalyptus oil health benefits in telugu

1. ఆస్త‌మా, సైన‌స్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను వేడి నీటిలో వేసి దాను నుంచి వ‌చ్చే ఆవిరిని వాస‌న పీల్చాలి. దీంతో శ్లేష్మం క‌రుగుతుంది. త‌ద్వారా శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. అలాగే ఆస్త‌మా ల‌క్ష‌ణాలు కూడా త‌గ్గుతాయి.

2. నోటి దుర్వాస‌న‌, దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీంతో ఆయా స‌మ‌స్యలు త‌గ్గుతాయి. యూక‌లిప్ట‌స్ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.

3. యూక‌లిప్ట‌స్ ఆయిల్ ను ఛాతి, గొంతుకు రాసి మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ద‌గ్గు త‌గ్గుతుంది. జ‌లుబు నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను వాస‌న చూసినా ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. యూక‌లిప్ట‌స్ ఆయిల్‌, నీటిని తీసుకుని మిశ్ర‌మంగా చేసి స్ప్రే బాటిల్ లో పోసి ఆ మిశ్ర‌మాన్ని మ‌స్కిటో రిపెల్లెంట్‌గా ఉపయోగించ‌వ‌చ్చు. దీంతో దోమ‌లు ఉండ‌వు.

5. యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను లేదా ఆకుల పేస్ట్‌ను గాయాలు, పుండ్ల‌పై రాస్తుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి.

6. యూక‌లిప్ట‌స్ ఆయిల్‌తో మ‌సాజ్ చేస్తే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఆ ఆయిల్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.

 

Admin

Recent Posts