Fenugreek Seeds For Hair : మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులతో అనేక లాభాలను మనం పొందవచ్చు. జుట్టు సమస్యలతో కూడా, చాలామంది బాధపడుతూ ఉంటారు. మెంతులు వలన ఏఏ ప్రయోజనాలను పొందవచ్చు..?, ఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. హెయిర్ కి సంబంధించి వివిధ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. హెయిర్ ప్యాక్లు, ఖరీదైన ఆయిల్స్ వాడక్కర్లేదు.
కొన్ని ఇంటి చిట్కాలని పాటిస్తే, జుట్టు బ్రహ్మాండంగా ఎదుగుతుంది. జుట్టు చిట్లి పోవడం, చుండ్రు, గరుకుగా జుట్టు మారడం ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఫాలిక్ యాసిడ్, కాల్షియంతో పాటుగా పొటాషియం, ఐరన్, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. శిరోజాలని ఆరోగ్యంగా ఉంచడానికి, మెంతులు బాగా పనిచేస్తాయి.
మెంతులు వలన జుట్టు పొడుగ్గా ఎదుగుతుంది. నిజానికి ఔషధంలా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్ళకి పోషణని ఇస్తుంది. మెంతులు తలకి రక్తప్రసరణని పెంచుతాయి. అలానే జుట్టు ని బలంగా మెంతులు మారుస్తాయి. జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తాయి. మెంతులలో హార్మోన్ రెగ్యులేటింగ్ కాంపౌండ్స్ హార్మోన్స్ అసమతుల్యత కారణంగా, జుట్టు రాలడాన్ని ఆపేస్తాయి. ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా మెంతులు తొలగిస్తాయి.
యాంటీ ఫంగల్ గుణాలతో పాటు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా మెంతులలో ఉంటాయి. చుండ్రు లేకుండా చేస్తాయి మెంతులు. కొబ్బరి నూనెలో కానీ ఆలివ్ ఆయిల్ లో కానీ, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేడి చేయండి. మెంతి గింజలు లేత గోధుమ రంగులోకి వచ్చేదాకా ఉంచి, తర్వాత మెంతి నూనెని చల్లారనివ్వండి. మెంతి గింజలు నూనెతో తలని మసాజ్ చేయండి. గంట తర్వాత షాంపుతో కడిగేసుకుంటే, బాగా పని చేస్తుంది. మెంతులని నీళ్ళల్లో వేసి 15 నిమిషాలు మరిగించండి. నీళ్లు చల్లారాక, వడకట్టేసి షాంపూతో తలస్నానం చేశాక ఈ మెంతి వాటర్ తో హెయిర్ కడిగేసుకోండి. ఇలా చేస్తే కూడా, చక్కటి ఫలితం ఉంటుంది.