Flax Seeds For Hair Growth : వీటిని ఇలా వాడితే చాలు.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Flax Seeds For Hair Growth : జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించ నూనెను,షాంపుల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు ఎదుగుద‌ల ఆగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇలా వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వివిధ ర‌కాల చిట్కాల‌కు బ‌దులుగా ఒకే ఒక చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అంద‌మైన‌, పొడ‌వైన జుట్టును కోరుకునే వారు అవిసె గింజ‌ల జెల్ ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజ‌లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే అవిసె గింజ‌లు మ‌న జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజ‌ల జెల్ ను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. అవిసె గింజ‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్ల‌తో పాటు విట‌మిన్ ఇ, మెగ్నీషియం, సిలీనియం, విట‌మిన్ బి6 ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌ర‌చ‌డంలో, జుట్టు పెరిగేలా చేయ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. అలాగే జుట్టు ఊడిపోయిన స్థానంలో మ‌ర‌లా కొత్త వెంట్రుక రావ‌డానికి 20 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే అవిసె గింజ‌ల జెల్ ను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఊడిపోయిన స్థానంలో మ‌ర‌లా 10 నుండి 15 రోజుల్లోనే కొత్త జుట్టు వ‌స్తుంద‌ని కూడా వారు చెబుతున్నారు.

Flax Seeds For Hair Growth use them in this way to get rid of the problem
Flax Seeds For Hair Growth

ఈ విధంగా అవిసె గింజ‌ల జెల్ మ‌న జుట్టుకు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల అంద‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. మ‌న జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే ఈ అవిసె గింజ‌ల జెల్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. దీని కోసం 50 గ్రాముల అవిసె గింజ‌ల‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి. త‌రువాత పావు లీట‌ర్ నీళ్లు పోసి నీటిని మ‌రిగించాలి. నీరు మ‌రిగే కొద్ది నీటిపై జెల్ ఏర్ప‌డుతుంది. ఈ జెల్ ను వ‌డ‌క‌ట్టి నేరుగా జుట్టు కుద‌ళ్ల‌కు, మాడు భాగానికి అంటేలా రాసుకోవాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. వారానికి ఒక‌సారి ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts