ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించి అధిక బరువును సులభంగా తగ్గించుకోండి..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను పాటించి విసిగిపోయారా ? ఏవీ పనిచేయడం లేదా ? అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటించి చూడండి. అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these ayurvedic tips to reduce over weight

1. ఉదయం పరగడుపున పావు గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు.

2. తిప్పతీగ రసం, త్రిఫల చూర్ణం కొద్ది కొద్దిగా తీసుకుని నీటిలో వేసి కషాయం కాయాలి. అందులో కొద్దిగా తేనె కలిపి పరగడుపున 30 ఎంఎల్‌ మోతాదులో తాగాలి. బరువు తగ్గుతారు.

3. పావు గ్లాస్ గోరు వెచ్చని నీళ్లలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ తేనె కలిపి పరగడుపున తాగితే బరువు తగ్గుతారు.

4. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ ఆవు పాలను గోరు వెచ్చగా చేసి తాగుతుండాలి. అందులో చక్కెర కలపకుండానే తాగాలి. దీని వల్ల ఒంట్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది.

5. అన్నంలో మొదటి ముద్ద శొంఠి కలిపి తింటే బరువు త్వరగా తగ్గుతారు.

6. కరక్కాయ చూర్ణం, ఉసిరిక చూర్ణం, పిప్పళ్ల చూర్ణంలను సమాన భాగాల్లో తీసుకుని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లలో కలిపి రోజూ ఉదయం పరగడుపునే తాగాలి. బరువు తగ్గుతారు.

7. కైసోర గుగ్గులు ఉదయం, సాయంత్రం అన్నానికి ముందు వేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది.

Editor

Recent Posts