Digestive Problems : మారిన మన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. మలబద్దకం, కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ ఎసిడిటి వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. పొట్ట పూర్తిగా శుభ్రం అ్వవకపోవడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పొట్ట శుభ్రం అవ్వకపోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతాము. ఆకలి వేయదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మనం దేనిపై దృష్టి పెట్టకలేకపోతాము. క్రమంగా ఈ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. జుట్టు రాలడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.
మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. పొట్ట శుభ్రం అవ్వక తిన్నా ఆహారం సరిగ్గా జీర్ణమవ్వక ప్రేగుల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా పొట్ట శుభ్రం అవ్వాలంటే మనం కొన్ని రకాల చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పొట్ట పూర్తిగా శుభ్రం అవుతుంది. పొట్టను శుభ్రం చేసే చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక కళాయిలో రెండు టీ స్పూన్ల జీలకర్ర, రెండు టీ స్పూన్ వాము వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. తరువాత ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ నల్ల ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ శొంఠి పొడి, అర టీ స్పూన్ పుదీనా ఆకుల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి భోజనం చేసిన గంట తరువాత ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల ప్రేగుల్లో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలన్నీ తొలగిపోయి కడుపు శుభ్రం అవుతుంది. అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ చిట్కాను ప్రతిరోజూ వాడకూడదు. ఒక రోజు వాడిన తరువాత రెండు రోజులు వదిలి వాడాలి. ఇలా వాడడం వల్ల మనం మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే కడుపును శుభ్రం చేయడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో మనకు ఆముదం ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లల్లో అర చెక్క నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తాగడానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి. తరువాత ఆముదం నూనె కలిపిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతో పాటు ప్రేగులు కూడా పూర్తిగా శుభ్రం అవుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం మన పొట్టను పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.