చిట్కాలు

పైసా ఖ‌ర్చు లేకుండా ముఖంపై న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌ను ఇలా తొల‌గించుకోండి..!

ముఖంపై నల్లమచ్చలు చాలా సాధారణమైన సమస్య. కానీ ఇబ్బందికరమైన సమస్య. ఐతే వీటిని పోగొట్టుకోవడానికి చాలా ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతో లేపనం తయారు చేసుకుని కూడా ఈ నల్లమచలను తొలగించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున్న నిద్రలో నుండి లేవగానే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొద్దున్నపూట ముఖాన్ని కడగడం వల్ల ఆయిల్ పేరుకోవడం తగ్గుతుంది. శనగపిండిని రోజ్ వాటర్ లో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న నల్లమచ్చలున్న భాగంలో మర్దన చేయాలి. కొద్ది నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి.

ఒక టవల్ తీసుకుని, దాన్ని గోరువెచ్చని నీటిలో ముంచి, ముఖంపై కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దానివల్ల నల్లమచ్చలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇంకా, ఓట్స్ ని వాడి కూడా ముఖంపై నల్లమచ్చలను పోగొట్టవచ్చు. దానికోసం ఓట్స్ విత్తనాలని వాడాల్సి ఉంటుంది. ఓట్స్ విత్తనాలని స్క్రబర్ గా వాడితే నల్లమచ్చలు తగ్గుతాయి. ఈ స్క్రబర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

follow these wonderful home remedies to remove dark spots

ఓట్స్ గింజలు, పెరుగు, నిమ్మరసం.. ఈ మూడు పదార్థాలని ఒకే దగ్గర మిక్స్ చేసి, స్క్రబర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ స్క్రబర్ ని ముఖానికి పెట్టుకోవాలి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకుని, చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై నల్లమచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది.ఏమాత్రం ఖరీదు చేయని ఈ టిప్స్ ఒకసారి ప్రయత్నించండి మరి.

Admin

Recent Posts