చిట్కాలు

Weight Loss : రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు.. కేజీల‌కు కేజీల బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..

Weight Loss : ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. కార‌ణం ఏదైనా స‌రే.. అధికంగా బ‌రువు ఉంటే ఇబ్బందే క‌లుగుతుంది. అందువ‌ల్ల దాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అయితే బ‌రువు ఎక్కువ‌గా ఉన్న‌వారు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే వస్తువులతోనే సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది. త‌ప్ప‌క ఫ‌లితం ల‌భిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయను సగానికి కోసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న స్పూన్ లో సగం కాఫీ పొడి, అలాగే చిన్న స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి అర టీస్పూన్ తేనె కలిపి తాగాలి.

follow this wonderful home remedy for weight loss

డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతాయి. దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు అధిక బరువును తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క‌నుక దీన్ని రోజూ త‌ప్ప‌క తాగాలి. దీంతో బ‌రువు త‌గ్గ‌డంతోపాటు అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts