Ganji For Hair : దీన్ని రాస్తే చాలు.. ఎంత లాగినా స‌రే జుట్టు రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

Ganji For Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌న‌ల్ని ప్ర‌ధానంగా వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన పడుతున్నారు. త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు, జుట్టు దువ్వుకున్న‌ప్పుడు విప‌రీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, జుట్టును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఈ స‌మ‌స్య‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల షాంపుల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌క ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు.

ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఈ చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో గంజి నీళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో అన్నం వార్చ‌గా వ‌చ్చిన గంజి నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని 2010 వ సంవత్స‌రంలో బ్యూటీ కేర్ యూనివ‌ర్సిటీ, యొకోహోమా, జ‌పాన్ వారు క‌నుగొన్నారు. ఈ గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం జుట్టు రాల‌డాన్ని తగ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తున్నారు. పూర్వం రోజుల్లో ఎక్కువ‌గా అన్నాన్ని గంజి వార్చి ఆహారంగా తీసుకునే వారు. ఇలా అన్నం వార్చ‌గా వ‌చ్చిన గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Ganji For Hair here it is the way to use it
Ganji For Hair

అలాగే ఈ గంజిని జుట్టు కుదుళ్ల నుండి చివ‌రి వ‌ర‌కు ప‌ట్టించి 20 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఒక గంట త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. అంతేకాకుండా ఈ చిట్కాను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు జుట్టు ప‌ట్టులాగా త‌యార‌వుతుంది. జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఖ‌ర్చు లేకుండా స‌హ‌జ సిద్దంగా జుట్టును ధృడంగా, బ‌లంగా మార్చుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts