Ginger Oil For Hair : మనలో చాలా మంది జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, వాతవరణ కాలుష్యం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో జింజరాయిల్ ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జింజరాయిల్ మనకు షాపుల్లో అలాగే ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తుంది. 100 గ్రాముల జింజరాయిల్ దాదాపు 700 రూపాయల వరకు ఉంటుంది.
కానీ దీనిని వాడడం వల్ల తల చర్మంపై ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నూనెలో ఉండే జింజరాల్ అనే రసాయన సమ్మేళనం నేరుగా జుట్టు కుదుళ్లపై ప్రభావాన్ని చూపిస్తుంది.ఇది జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరోటీన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో, జుట్టు కుదుళ్లు ఈ ప్రోటీన్ ను ఎక్కువగా గ్రహించేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతో జుట్టు వేగంగా, త్వరగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ జింజరాల్ నూనెను వాడడం వల్ల జుట్టు పెరగడంతో పాటు మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది. అలాగే దీనిని వాసన చూడడం వల్ల ఆస్థమా వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ జింజరాయిల్ ను వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ఈ జింజరాయిల్ ను ముందుగా జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దీనిని ఇలాగే గంట పాటు ఉంచిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.