Hair Oil For Growth : దీన్ని త‌ల‌కు రాస్తే చాలు.. మీరు ఊహించ‌లేనంత‌గా జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..!

Hair Oil For Growth : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టును పొడ‌వుగా, ఒత్తుగా మార్చుకోవ‌చ్చు. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. జుట్టు ఒత్తుగా, అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. జుట్టు పలుచ‌గా ఉన్న వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జుట్టును ఒత్తుగా మార్చే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి…అలాగే ఈ నూనెను ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం తాజా క‌ల‌బంద ఆకును, మెంతుల‌ను, కొబ్బ‌రి నూనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతుల‌ను వేసుకోవాలి. త‌రువాత క‌ల‌బంద అంచుల‌ను తీసేసి వాటిని ముక్క‌లుగా చేసి నూనెలో వేసుకోవాలి. ఈ నూనెను మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేడి చేయాలి. క‌ల‌బంద ఆకుల్లో ఉండే నీరంతా పోయి ఆకులు న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత వ‌డ‌క‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె నుండి మ‌న‌కు కావ‌ల్సినంత నూనెను మ‌రో గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో 2 టీ స్పూన్ల ఉల్లిపాయ ర‌సం వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివరి వ‌ర‌కు ప‌ట్టించాలి.

Hair Oil For Growth how to make it and apply
Hair Oil For Growth

ఈ నూనెను ఒక రోజంతా జుట్టుకు అలాగే ఉంచి మ‌రుస‌టి రోజూ త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. క‌ల‌బంద‌, ఉల్లిపాయ‌, మెంతులు, కొబ్బ‌రి నూనెలో మ‌న జుట్టు పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టును ఒత్తుగా పొడ‌వుగా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ప‌లుచ‌గా మారిన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు చిట్ల‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా మ‌న ఇంట్లోనే నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టును ఒత్తుగా, పొడువుగా, మృదువుగా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts