Hair Oiling Mistakes : జుట్టుకు నూనె రాస్తున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Hair Oiling Mistakes : జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాల‌ని మనం అనేక ర‌కాల సంర‌క్ష‌ణ చర్య‌ల‌ను చేప‌డుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యం కోసం మ‌నం తీసుకునే సంర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ల్లో జుట్టుకు నూనె రాసుకోవ‌డం కూడా ఒక‌టి. జుట్టుకు నూనె రాసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. నూనె రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు పొడిబార‌కుండా ఉంటుంది. త‌ల‌చ‌ర్మం పొడిబార‌కుండా తేమ‌గా ఉంటుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. నూనె రాసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాలు అంది జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. అలాగే మ‌నం ర‌కర‌కాల నూనెల‌ను రాసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మ‌న‌లో చాలా మంది కొబ్బ‌రి నూనెను జుట్టుకు రాసుకుంటూ ఉంటారు. కొబ్బ‌రి నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టుకు ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో ఉండే మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ వంటి పోష‌కాలు జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

అలాగే కొంద‌రు బాదం నూనెను కూడా రాసుకుంటూ ఉంటారు. బాదంనూనెను రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు జుట్టు పొడి బార‌కుండా ఉంటుంది. ఈ నూనెలో ఉండే విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఎదుగుద‌ల‌లో కూడా మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అదే విధంగా జుట్టుకు రాసుకోద‌గిన నూనెల‌ల్లో ఆలివ్ నూనె కూడా ఒక‌టి. త‌ల‌లో పంగ‌ల్ ఇన్పెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో, త‌ల చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచ‌డంలో ఈ నూనె మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఇక జుట్టుకు నువ్వుల నూనెను, ఆముదాన్ని కూడా రాసుకుంటూ ఉంటారు. ఈ నూనెల‌ను రాసుకోవ‌డం వల్ల ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్ లు త‌గ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంది. అయితే మ‌న‌లో చాలా మంది ఈ నూనెల‌ను జుట్టుకు రాసుకునేట‌ప్పుడు అనేక త‌ప్పులు చేస్తూ ఉంటారు. కొంద‌రు జుట్టుకు నూనె రాసుకుని రోజుల త‌ర‌బ‌డి అలాగే ఉంటారు.

Hair Oiling Mistakes do not do these
Hair Oiling Mistakes

ఇలా చేయ‌డం వ‌ల్ల ఫంగ‌ల్ ఇన్పెక్ష‌న్ లు వ‌స్తాయి. కొంద‌రు రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుని పడుకుంటూ ఉంటారు. ఇలాచేయ‌డం వ‌ల్ల త‌ల‌లో, నుదుటి మీద‌, క‌నుబొమ్మ‌ల మీద‌, చెవుల వెనుక భాగంలో మచ్చ‌లు వ‌స్తాయి. అలాగే జుట్టుకు ఎక్కువ కాలం పాటు నూనెను ఉంచుకోవ‌డం వ‌ల్ల ముఖంపై న‌ల్ల‌టి మ‌చ్చ‌లు కూడా వ‌స్తాయి. జుట్టుకు నూనె రాసుకోవ‌డం మంచిదే అయిన‌ప్ప‌టికి నూనెను రాత్రంతా ఉంచుకోకూడ‌దు. అలాగే రోజుల త‌ర‌బ‌డి కూడా ఉంచుకోకూడదు. త‌ల‌స్నానం చేయ‌డానికి అర‌గంట ముందు నూనె రాసుకుని మ‌ర్దనా చేయాలి. చాలా మంది జుట్టుకు నూనె రాసి గ‌ట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వల్ల జుట్టు మృదుత్వాన్ని కోల్పోవ‌డంతో పాటు జుట్టు చిట్ల‌డం, జుట్టు రాల‌డం వంటివి కూడా జ‌రుగుతాయి. క‌నుక జుట్టుకు నూనె రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఈ విధంగా జుట్టుకు నూనెను రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఎటువంటి జుట్టు స‌మ‌స్య‌లు లేకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts