High BP Home Remedies : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ప్రతి ముగ్గురిలో ఒకరు దీని బారిన పడుతున్నారని గణంకాలు తెలియజేస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. 2030 నాటికి పాతిక కోట్లమంది భారతీయులు అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ అధిక రక్తపోటు సమస్యను నిర్లక్ష్యం చేసే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆందోళన కారణంగా యువత కూడా ఈ రక్తపోటు బారిన పడుతున్నారు. పాలికేళ్ల లోపు యువ భారతంలో 30 శాతం మంది ఈ హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు కారణంగా జబ్బుల బారిన పడుతున్నారు. బీపీ సమస్య బారిన పడిన వారు మందులను జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
ఈ మందులను వాడుతూనే కొన్ని చిట్కాలను వాడడం వల్ల బీపీ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలే కాకుండా పుచ్చకాయ గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలు బీపీని అదుపులో ఉంచడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం ఒక జార్ లో పుచ్చకాయ గింజలను, గసగసాలను సమపాళ్లల్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం పూటకు ఒక టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గసగసాలను తినని వారు ఒక టీ స్పూన్ పుచ్చకాయ గింజలను దంచి ఒక కప్పు వేడి నీటిలో వేసి ఒక గంట పాటు పక్కకు ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి రోజూ నిర్ణీత వ్యవధుల్లో నాలుగు టీ స్పూన్ల చొప్పున తీసుకున్నా కూడా కొన్ని రోజుల్లోనే సమస్య నుండి బయటపడవచ్చు.
ఈ పుచ్చకాయ గింజల్లో ఉండే కుక్రో సిట్రిస్ అనే రసాయన సమ్మేళనం రక్తనాళాల గోడల్ని వెడల్పు చేయడంతో పాటు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మరసం మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రక్తపోటును తగ్గించడంలో కూడా నిమ్మరసం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని పిండి రోజూ పరగడుపునే తాగాలి. దీనిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లా పని చేసి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగకుండా చేస్తుంది. అలాగే రక్తనాళాలు రక్తప్రసరణకు అనువుగా వంగేలా చేయడంలో కూడా నిమ్మరసం మనకు సహాయపడుతుంది. దీని వల్ల రక్తపోటు నుండి బయట పడవచ్చు.
అయితే నిమ్మరసం మిశ్రమానికి ఉప్పు, పంచదార వంటివి కలపకుండా ఉండడమే ఉత్తమం. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కొబ్బరి నీళ్లు మనకు ఎంతో దోహదపడతాయి. ఈ నీటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయని పరిశోధనల్లో వెల్లడైంది. రోజూ కొబ్బరి నీళ్లను తాగుతూనే అప్పుడప్పుడు కొబ్బరి నూనెను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే మనం వంటల్లో ఉపయోగించే ఉల్లిపాయలు కూడా అధిక రక్తపోటు సమస్య నుండి బయట పడేలా చేయడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కోసం రోజూ ఒక ఉల్లిపాయను తినడం లేదా ఒకటిన్నర టీ స్పూన్ మోతాదులో ఉల్లిపాయ రసం, తేనెల మిశ్రమాన్ని తీసుకోవడం వంటివి చేయాలి.
ఇవే కాకుండా నీటిలో మెంతులను వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. మెంతుల్లో అధికంగా ఉండే పొటాషియం, ఫైబర్ వంటివి అధిక రక్తపోటు నుండి ఉపశమనాన్ని కలిగించడంలో తోడ్పడుతాయి. తేనె కూడా అధిక రక్తపోటును తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందుకోసం రోజూ పరగడుపున రెండు చెంచాల తేనె తీసుకోవడం మంచిది. అలాగే తేనెను, తులసి ఆకుల రసాన్ని సమపాళ్లలో కలిపి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రోజూ రెండు అరటి పండ్లను తినడం, అల్లాన్ని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవడం, కూరల్లో ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి అన్నీకూడా అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి తోడ్పడుతాయి. ఈ నియమాలను పాటిస్తూనే ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండడం వల్ల అధిక రక్తపోటుకు ఆమడ దూరంలో ఉండవచ్చు. తద్వారా బీపీ వల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.