Holy Basil Leaves For Headache : రెండు ఆకులు చాలు.. త‌ల‌నొప్పి వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Holy Basil Leaves For Headache : మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ వ‌ల్ల క‌లిగే త‌ల‌నొప్పిని తట్టుకోలేక ఏడ్చే వారు కూడా చాలా మంది ఉంటారు. ఒకానొక స‌మ‌యంలో త‌ల‌బ‌ద్ద‌లైన‌ట్టుగా కూడాఉంటుంది. తీవ్ర‌మైన మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నప్పుడు కొన్ని చిట్కాల‌ను వాడ‌డం వల్ల స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి పూర్తిగా త‌గ్గ‌న‌ప్ప‌టికి స‌త్వ‌ర ఉప‌శ‌మ‌నం మాత్రం క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు.

మైగ్రేన్ త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో అల్లం ఎంత‌గానో సహాయ‌ప‌డుతుంది. మైగ్రేన్ తో బాధ‌ప‌డేట‌ప్పుడు వారిలో వికారం, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అలాంటి స‌మ‌యంలో అల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించ‌డం వ‌ల్ల అలాగే అల్లాన్ని వాస‌న చూడ‌డం వ‌ల్ల వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు లావెండ‌ర్ ఆయిల్ ను నొప్పిగా ఉన్న భాగంలో కొద్దిగా రాసుకోవాలి. అలాగే ఈ ఆయిల్ ను వాస‌న చూడ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గుతాయి. దీంతో క్ర‌మంగా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అదేవిధంగా పిప్ప‌ర్ మెంట్ ఆయిల్ ను కొబ్బ‌రి నూనెలో క‌లిపి నొప్పి ఉన్న భాగంలో రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Holy Basil Leaves For Headache do this remedy
Holy Basil Leaves For Headache

అలాగే మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఒక గిన్నెలో ఒక‌గ్లాస్ నీటిని పోయాలి. త‌రువాత ఈ నీటిలో 10 తుల‌సి ఆకుల‌ను, 10 పుదీనా ఆకుల‌ను వేసి స‌గం గ్లాస్ నీళ్లు అయ్యే వ‌ర‌కు బాగా మరిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో తేనెను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు మెగ్నీషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. త‌ల‌నొప్పి ఎక్కువ‌గా బాధిస్తున్న‌ప్పుడు నాన‌బెట్టిన బాదంప‌ప్పును, అర‌టిపండును తీసుకోవాలి. వీటిని ఉండే మెగ్నీషియం త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌ల‌నొప్పి నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts