చిట్కాలు

వంట కోసమే కాదు వంటి కోసం కూడా. ఇంగువ..!!

సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే గాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే గుణం ఉంది. యాంటిఆక్సిడెంట్ లక్షణాలు ఇంగువలో ఉన్నాయి. చికాకు పెట్టే పేగు వ్యాధి పేగులో వాయువు, అజీర్తి మొదలైన లక్షణాలను తగ్గించడంలో ఇంగువ సహాయం చేస్తుంది.

home remedies using asafoetida must know

ఒక అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఇంగువ శ్వాసకోశ వ్యాధులన్ని తగ్గిస్తుంది. తేనె, అల్లం లో ఇంగువను కలిపి తీసుకుంటే దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంగువ నరాలను ఉత్తేజపరచడం ద్వారా మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts