Bay Leaves : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే.. బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకోవాలి..!

Bay Leaves : బిర్యానీ ఆకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాదానే ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. మ‌నం వంటల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా దీనిని మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుల‌ను అనారోగ్య స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌ల‌ను, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌ను, అధిక బ‌రువును, షుగ‌ర్ వ్యాధిని, గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

అంతేకాకుండా బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అయితే ఈ బిర్యానీ ఆకును ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆకుల‌ను పొడి రూపంలో తీసుకోవ‌చ్చు. అలాగే ఈ ఆకుల‌తో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఈ ఆకుల‌ను రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజ‌ల‌ను వేసి వేడి చేయాలి. ఈ నీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై 4 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టుకుని కొద్ది కొద్దిగా తాగాలి.

home remedies using Bay Leaves how to use them
Bay Leaves

ఇలా తాగ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ వంటి స‌మస్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొల‌గిపోతాయి. మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది.

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. నిద్ర‌లేమితో బాధ ప‌డే వారు రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ పాల‌ల్లో మ‌ధ్య‌స్థంగా ఉండే ఒక బిర్యానీ ఆకును వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ పాల‌ను వ‌డ‌క‌ట్టుకుని తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు. నిద్ర‌లేమి స‌మ‌స్య మ‌రీ తీవ్రంగా ఉన్న వారు ఈ పాలల్లో చిటికెడు జాజికాయ పొడిని క‌లిపి తీసుకోవ‌చ్చు. ఈ విధంగా బిర్యానీ ఆకు మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts