నువ్వులతో ఆరోగ్యం.. ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తారు. తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే తరచూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నువ్వులతో నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using sesame seeds

1. నువ్వులు, పెసలను ముద్దగా నూరి పెసరకట్టుతో తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

2. నల్ల నువ్వుల ముద్దకు ఐదో వంతు చక్కెర కలిపి మేకపాలతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.

3. నువ్వులకు చక్కెర కలిపి ముద్దగా నూరి తీసుకుంటే అతి ఆకలి తగ్గుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది.

4. నువ్వుల ముద్దలో వెన్న కలిపి కొన్ని రోజుల పాటు తింటే రక్తమొలలు తగ్గుతాయి. అలాగే నువ్వుల ముద్దకు నాగకేసరాల చూర్ణం, చక్కెర, వెన్న కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అర్శ మొలలు తగ్గుతాయి.

5. నలభై నుంచి ఎనభై గ్రాముల నల్ల నువ్వుల ముద్దను చన్నీల్లతో కలిపి ప్రతి రోజే ఉదయం తీసుకుంటూ ఉంటే అర్శమొలలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది.

6. నువ్వులు, శుద్ధి చేయబడిన జీడిగింజలను కలిపి స్వల్ప మోతాదులో తీసుకుంటే చర్మ వ్యాధులు, మందాగ్ని సమస్యలు తగ్గుతాయి. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.

7. నువ్వులు, శుద్ధి చేసిన జీడిగింజలు, కరక్కాయలు, బెల్లం సమంగా కలిపి మెత్తగా ముద్దగా నూరి కుంకుడు గింజంత మోతాదులో తీసుకుంటే జ్వరం, రక్తహీనత, దగ్గు, ఉబ్బసం తగ్గుతాయి.

8. నువ్వులను ముద్దగా నూరి ఉండలుగా చేసి పొట్ట భాగం మీద దొర్లించుతూ ప్రయోగిస్తే కడుపునొప్పి ఎంత తీవ్రస్థాయిలో ఉన్నా తగ్గుతుంది.

9. ఏడాదికి మించి పాతబడిన నెయ్యి, నువ్వుల నూనె, ఆవనూనెలను కలిపి శరీరానికి బాహ్యాభ్యంతరంగా వాడాలి. అన్ని రకాల వాత వ్యాధులు తగ్గుతాయి.

10. నువ్వులు, ఇప్ప పువ్వుల ముద్దను వేసి కట్టు కడితే గాయాలు మానుతాయి.

11. నువ్వుల ముద్దలో తేనె కలిపి కట్టులా కడుతుంటే పుండ్లు తగ్గుతాయి.

12. నువ్వుల పిండితో కట్టు కడుతూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అలాగే నువ్వుల ముద్దను కూడా రోజు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితం కనిపిస్తుంది.

13. నువ్వుల ముద్దను, అతి మధురం చూర్ణాన్ని పాలతో కలిపి మరిగించి ఆ మిశ్రమాన్ని పుక్కిలించాలి. దీని వల్ల దంతాలు దృఢంగా మారుతాయి.

14. నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసి మహిళలు తీసుకుంటే వారిలో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది.

Share
Admin

Recent Posts