గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా ఉండేందుకు పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే…

if you want hearty healthy take these daily

1. తాజా వెన్నలో చక్కెర కలుపుకుని రోజూ స్వల్ప మోతాదులో తీసుకోవాలి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

2. రోజూ మిరియాల పొడిని ఏ రూపంలోనైనా తీసుకోవాలి. లేదా మిరియాల చారు కూడా తాగవచ్చు. దీని వల్ల కూడా గుండె సురక్షితంగా ఉంటుంది.

3. చింత చిగురును నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని రోజూ వాడుకోవాలి. దీంతో గుండెకు బలం చేకూరుతుంది.

4. వంటల్లో పాత చింత పండును వాడాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

5. చక్కెర, యాలకులను కలిపి స్వల్ప మోతాదులో రోజూ తీసుకోవచ్చు.

6. పచ్చికొబ్బరిని తరచూ తింటే గుండెకు బలం కలుగుతుంది. కానీ అతిగా తినరాదు. తింటే దగ్గు వస్తుంది.

7. కిస్మిస్‌లు, వాల్‌నట్స్‌ను తరచూ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

8. నెయ్యిలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను బాగా వేయించి వాటిని భోజనం చేసేముందు తీసుకోవాలి. దీని వల్ల గుండెకు బలం కలుగుతుంది.

9. గులాబీ పువ్వుల రేకులను నీడలో ఆరబెట్టి పొడి చేయాలి. దాన్ని రోజూ అర టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అందులో జాజికాయ పొడి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

10. స్ట్రాబెర్రీలను తినడం వల్ల గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.

11. చక్రకేళి అరటి పండులో కొద్దిగా తేనె కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. గుండెకు బలం కలుగుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts