వేసవిలో చల్లగా ఉంచే పచ్చిమామిడి కాయ డ్రింక్‌.. ఇలా చేసుకోండి..!

వేసవిలో మనకు మామిడికాయలు బాగానే లభిస్తాయి. పచ్చి మామిడికాయలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. వాటితో చాలా మంది పచ్చళ్లు పెట్టుకుంటారు. కొందరు పప్పు చేస్తారు. కొందరు పులిహోర చేసుకుంటారు. అయితే పచ్చిమామిడికాయలతో చల్ల చల్లని సమ్మర్‌ డ్రింక్‌ తయారు చేసుకుని సేవించవచ్చు. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

summer cool raw mango drink

కావల్సిన పదార్థాలు

  • పచ్చిమామిడి కాయ – 1
  • నీళ్లు – 2 గ్లాసులు
  • చక్కెర – 100 గ్రా.
  • యాలకులు – 3
  • మిరియాల పొడి – 1 టీస్పూన్‌

తయారీ విధానం

పచ్చిమామిడి కాయను కుక్కర్‌లో మూడు కూతలు వచ్చే వరకు ఉడికించాలి. చల్లారాక చెక్కు తీసి మిక్సీలో వేసి మెత్తని ముద్దగా చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. రెండు గ్లాసుల నీటిలో చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి. తీగపాకం వచ్చాక పచ్చి మామిడి రసం వేసి రెండు మూడు నిమిషాలయ్యాక దించేయాలి. తరువాత దంచిన యాలకులు, మిరియాల పొడి వేసి దించేలా. తేనెలా ఉండే ఈ మామిడి డ్రింక్‌ను చల్లని నీటితో కలిపితే మామిడి పానీయం రెడీ అవుతుంది.

ఈ డ్రింక్‌ను సేవించడం వల్ల విటమిన్‌ సి, కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలు లభిస్తాయి. వేసవిలో తలెత్తే అధిక దాహం సమస్య తగ్గుతుంది. దప్పిక తీరుతుంది. వేసవిలో కోల్పోయే ద్రవాలు భర్తీ అవుతాయి. కాలేయం పనితీరు మెరుగు పడుతుంది. పైత్యం తగ్గుతుంది. నోటి పూతలు, చిగురువాపులు, డయాబెటిస్‌, స్థూలకాయం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే డయాబెటిస్‌, అధిక బరువు తగ్గాలంటే చక్కెరకు బదులుగా తేనెను వాడాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts