How To Use Nutmeg : మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. మసాలా వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటాము. జాజికాయ వంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే జాజికాయ మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా జాజికాయను ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిత కషాయాన్ని చేసి తీసుకుంటారు. అలాగే పొడిగా చేసి ఔషధంగా వాడుతూ ఉంటారు. జాజికాయ కషాయం వగరుగా, చేదుగా ఉంటుంది. అలాగే వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే జాజికాయను వాడడం వల్ల శరీరంలో ఉండే ధాతువులు అన్ని చక్కగా పని చేస్తాయి. జాజికాయను వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
అనేక సమస్యలు దూరమవుతాయి. జాజికాయను పొడిగా చేసి చిటికెడు మొత్తంలో తీసుకుని పాలల్లో కలిపి చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇలా పాలల్లో కలిపి నెల నుండి రెండు నెలల పాటు ఇవ్వడం వల్ల పిల్లలు బరువు పెరుగుతారు. వారిలో ఎముకలు ధృడంగా అవుతాయి. నడుము నిలబడని పిల్లలకు నడుము చక్కగా నిలబడుతుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పొడిని తీసుకోవచ్చు. ఈ పొడిని పాలల్లో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో సప్తధాతువులు ఆరోగ్యంగా, ధృడంగా మారతాయి. అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన, మారిన మన జీవన విధానం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు చాలా మంది స్లీపింగ్ టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. ఇలా నిద్రమాత్రలను వాడడానికి బదులుగా జాజికాయను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజూ రాత్రి నిద్రించే ముందు పాలల్లో జాజికాయ పొడి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది. మాత్రలువాడే అవసరమే ఉండదు. ఈ విధంగా జాజికాయ మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.