చిట్కాలు

సిగ‌రెట్ తాగ‌డం వ‌ల్ల మీ పెద‌వులు న‌ల్ల‌గా మారాయా.. అయితే ఇలా చేయండి..

సిగిరెట్‌..తాగేవారికి మత్తుగా.. ఆ పొగ పీల్చేవారికి చిరాకుగ్గా ఉండే ఓ అందమైన చెడు అలవాటు.! ఫ్రెండ్‌ స్టైల్‌గా సిగిరెట్‌ తాగుతున్నాడని మనకు తాగాలనిపించి.. మొత్తానికి ఎలానో ఆ అలవాటు చేసుకుంటాం.. ఇక టెన్షన్‌ వచ్చినా, ఖాళీగా ఉన్నా, తలనొప్పి వచ్చినా ఇలా ఏ ఫీలింగ్‌ వచ్చినా.. మైండ్‌ సిగిరెట్‌ పాట పాడుతుంది.. లాస్ట్‌ పఫ్‌ వరకూ ఎంజాయ్‌ చేస్తూ..హ్యాపీగా తాగేస్తారు.. ఇక్కడి వరకూ సీన్‌ బానే ఉంది కానీ.. అది ఎక్కువ తాగటం వల్ల లోపల పార్ట్స్‌ డామేజ్‌ అవుతాయి. అది దీర్ఘకాలిక నష్టం కాబట్టి మనకు పెద్దగా తెలియదు..కానీ ఇన్‌స్టెంట్‌గా జరిగే లాస్‌. పెదాలు నల్లగా అయిపోవడం.. ఇదైతే అస్సలు సహించలేం.. అమ్మాయిలతే..సిగిరెట్‌ తాగినా లిప్‌స్టిక్‌ వేసి కవర్‌ చేస్తారు.. కానీ అబ్బాయిల పరిస్థితి ఏంటి..? చెప్పకనే . మనకున్న అలవాటు గురించి అందిరికి తెలిసిపోతుంది.. అస్సలు ఫేస్ లుక్‌ మారిపోతుంది. చెండాలంగా తయారవుతారు.. నవ్వినా, మాట్లాడినా పేదాలు అలా నల్లగా ఉంటే గలీజ్‌ ఉంటుంది కదా..? తప్పు చేసినా దాన్ని కవర్‌ చేసుకునే టెక్నిక్స్‌ తెలుసుకోవాలి..! మరీ ఇలా పేదాలు నల్లగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దామా..!

సిగిరెట్‌ తాగితే పెదాలు ఎందుకు బ్లాక్‌ అవుతాయి.. సిగరెట్‌లో ఉండే నికోటిన్.. కాలక్రమేణా పెదవులకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తుంది. సిగరెట్ పొగ నుంచి వెలువడే వేడి శరీరంలోని మెలనిన్‌ను విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. దీని వలన నోటి చుట్టూ ఉన్న ప్రాంతం నల్లగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. పెదాలు నల్లగా మారుకుండా ఉండాలంటే ఇలా చేసేయండి..! లిప్స్ తేమగా ఉంచుకోవాలి.. పెదాలు తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. పెదాలు డ్రైగా ఉంటే మరింత నల్లగా మారతాయి.. కాబట్టి పెదాలు తేమగా ఉండడం చాలా ముఖ్యం. దీనికోసం లిప్​ బామ్​లు, వెన్న, లిప్ సీరమ్​లు వాడితే.. ఇవి ఎక్కువకాలం పెదాలు తేమగా ఉండేలా చేస్తాయి. అనామ్లజనకాలు, సిరమైడ్‌లతో సమృద్ధిగా ఉన్న లిప్ సీరమ్‌లు.. ప్రభావవంతతంగా పనిచేస్తాయి. దెబ్బతిన్న పెదాలను ఇవి బాగు చేస్తాయి.

if you have black lips follow this remedy

పెదాలు నల్లబడడాన్ని తగ్గించడానికి ఎక్స్‌ఫోలియేషన్ చాలా కీలకం. ఆ ప్రాంతాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మీకు చాలా సున్నితమైన, రాపిడి లేని పెదవి స్క్రబ్స్ అవసరం. AHA ఆధారిత లిప్ స్క్రబ్ ధూమపానం చేసే పెదాలపై సున్నితంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్రాన్యులేటెడ్ స్క్రబ్‌లు పెదావుల మధ్య రాపిడిని సృష్టిస్తాయి. ఇవి పెదవులు మరింత నల్లబడేలా చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వీటిని ఉపయోగించండి. UV కిరణాలు మీ పెదవుల రంగును ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల సోలార్ కెలిటిస్ ఏర్పడవచ్చు. తద్వార పెదాలు పొడిగా, పగులుతాయి. హానికరమైన యూవీ కిరణాలు నుంచి రక్షించుకోవడానికి కనిష్ట SPF 15-30 ఉన్న లిప్ బామ్‌ని వాడండి. ప్రతిరోజు పెదాలకు మంచి లిప్ సీరమ్ లేదా హైడ్రెంట్స్, యాంటీఆక్సిడెంట్‌లతో నిండిన లిప్ బామ్‌ని అప్లై చేస్తే.. మీ లిప్స్ కలర్ ఆటోమేటిక్​గా నార్మల్ రంగుకు మారిపోతాయి. అయితే.. చెడు ఎప్పటికైనా చెడే చేస్తుంది.. కాబట్టి ధూమపానం అలవాటు ఎక్కువగా ఉంటే.. అది కంట్రోల్‌ చేసుకోవడం ఉత్తమం.

Admin

Recent Posts