Immunity : ప్రస్తుత కాలంలో అనేక రకాల వైరస్ లు మన మీద దాడి చేస్తాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి మనం అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇలా ఇన్పెక్షన్ ల బారిన పడడానికి ప్రధాన కారణం మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం. మన శరీరంలో ఉండే వైరస్ లు, బ్యాక్టీరియాలు, మలిన పదార్థాలు బయటకు పోవాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. మన చుట్టూ అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు ఉంటాయి. మన మనం తీసుకునే ఆహారం ద్వారా, తాగే నీరు ద్వారా, గాలి ద్వారా మనం శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. చాలా చేరినప్పటికి కొందరూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. కారణం వారి శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడమే.
అందుకే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే ఎటువంటి వైరస్ లు దాడి చేసిన మనల్ని ఏమి చేయలేవు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల సహజ సిద్దంగా మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీని కోసం ప్రతిరోజూ మనం 4 నుండి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. అలాగే రెండు సార్లు మలవిసర్జన చేయాలి. దీంతో ప్రేగులు శుభ్రపడతాయి. దీంతో వ్యర్థాలు తగ్గి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే సాయంత్రం పూట ఆహారాన్ని 6 నుండి 7 లోపే తీసుకోవాలి. దీంతో మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
దీంతో శరీరం తనని తాను శుభ్రపరుచుకుని వ్యర్థాలను, క్రిములను బయటకు పంపిస్తుంది. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ విధంగా సాయంత్రం పూట తీసుకునే తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి. అలాగే ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను, పండ్లను, ఖర్జూర పండ్లను ఉదయం పూట తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థను మెరుగుపరిచే బి కాంప్లెక్స్ విటమిన్స్, ప్రోటీన్స్, ఇతర పోషకాలు శరీరానికి లభిస్తాయి. వైరస్ లు, బ్యాక్టీరియాలను నశింపజేసే రసాయనాలు ఉత్పత్తి అవ్వాలంటే మనకు కొన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలన్నీ కూడా ఈ మొలకెత్తిన గింజల్లో ఉంటాయి.
వీటిని తీసుకోవడం వల్ల సహజ సిద్దంగానే మన శరీరంలో రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. ఇక వ్యాధి నిరోధక పెరగాలంటే వారంలో ఒకసారి ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసం ఉన్న రోజు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగాలి. శక్తి కొరకు తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల మన శరీరంలో రోగ నిరోదకశక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.