సాధారణంగా మనలో కొందరికి మెదడు అంత యాక్టివ్‌గా ఉండదు. నిజానికి అది వారి తప్పు కాదు. ఎందుకంటే.. ఒక మనిషికి తెలివితేటలు అనేవి ఎవరో నేర్పిస్తే రావు.. అవి పుట్టుకతో వస్తాయి. అందువల్ల మెదడు యాక్టివ్ లేదని ఎవర్నీ నిందించాల్సిన పనిలేదు. ఇక వయస్సు మీద పడే వారిలో, పలు అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో సహజంగానే మెదడు యాక్టివ్‌గా ఉండదు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే.. మెదడును ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు. దీంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* గణిత సంబంధమైన సమస్యలను పరిష్కరించడం, పజిల్స్ పూర్తి చేయడం, మెదడుకు మేత పెట్టే ప్రశ్నలను సాల్వ్ చేయడం.. వంటి పనులు చేయడం ద్వారా మెదడు యాక్టివ్‌గా మారుతుంది.
* పెయింటింగ్, డ్రాయింగ్, సంగీతం వినడం వంటివి నిజానికి మనకు ఉండే అలవాట్లు. కానీ వాటిలో తరచూ నిమగ్నమవడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి తద్వారా మెదడు చురుగ్గా మారుతుందట. అలా అని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లోనే తేలింది.
* నిత్యం వీలైనంత సేపు వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో మెదడుకు రక్తసరఫరా పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది.
* మనం నిత్యం శరీరానికి కావల్సిన క్యాలరీలు ఉండే ఆహారం కన్నా కొంత తక్కువ ఆహారం తీసుకుంటే.. తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మెదడు యంగ్‌గా ఉంటుందట.
* హైబీపీ, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకుంటే.. మెదడు యాక్టివ్‌గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
* మద్యపానం, ధూమపానం మానేస్తే మెదడు చురుగ్గా మారుతుంది. అలాగే ఎల్లప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీని వల్ల కూడా మెదడు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* నిత్యం తగినన్ని గంటలపాటు నిద్రపోవడం, తలకు ఎలాంటి దెబ్బలు, గాయాలు తగలకుండా చూసుకోవడం.. వల్ల కూడా మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు.