Muscle Cramps : ప్రస్తుత కాలంలో చాలా మంది కదలకుండా కూర్చొని చేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కదలకుండా ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల కండరాలు పట్టేయడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. యోగాసనాలు చేసేటప్పుడు, వాకింగ్ వంటివి చేసేటప్పుడు పిక్కలు పట్టేయడం, ఏదైనా ఎత్తుగా ఉన్న దానిని అందుకోవడానికి శరీరాన్ని సాగదీసినప్పుడు, బిగుతుగా ఉండే దుస్తులను ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే నిద్రలో కూడా కొందరిలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి. కండరాలు పట్టేయడం వల్ల తీవ్రమైన నొప్పి, బాధ ఉంటాయి. కొందరిలో ఈ కండరాలు పట్టేయడం అనేది ఎక్కువ సమయం వరకు ఉంటుంది. కండరాలు పట్టేయడం అనే ఈ సమస్య నుండి సహజ సిద్దంగా చాలా సులభంగా బయటపడవచ్చు.
చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి స్ప్రేలను, మందులను వాడుతూ ఉంటారు. ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా లభించే పెప్పర్ మెంట్ ఆయిల్ ను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. పెప్పర్ మెంట్ ఆయిల్ కండరాలు పట్టేయడం వంటి సమస్యను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది. కండరాల నొప్పులను, పిక్క పట్టేయడం వంటి సమస్యలను తగ్గించడంలో పెప్పర్ మెంట్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. మెడ పట్టేసినప్పుడు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు, కండరాల నొప్పులకు కూడా ఈ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. దీనిలో ఉండే మెంథాల్, మెంథీన్ , మెంథిల్ ఎసిటేట్ అనేక మూలకాలు ఈ నూనెలో ఉంటాయి. ఇవి నొప్పులను తగ్గించడంలో ఎంతగానో ఉయోగపడతాయి.
మంచి నాణ్యమైన పెప్పర్ మెంట్ ఆయిల్ ను 2 లేదా 3 చుక్కల మోతాదులో తీసుకుని కండరాలు పట్టేసినప్పుడు నొప్పి ఉన్న చోట రాస్తూ 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఈ ఆయిల్ ఎక్కువ ఘాటూగా ఉంటుంది. ఈ ఘాటును తట్టుకోలేని వారు దీనిని మరో రెండు చుక్కల కొబ్బరి నూనెను కలిపి రాసుకోవాలి. ఇలా రాసిన తరువాత వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. కండరాలు పట్టేసినప్పుడు ఇలా పెప్పర్ మెంట్ ఆయిల్ ను రాసి మర్దనా చేడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా వారం రోజుల పాటు చేయడం నిద్రలో పిక్కలు పట్టేయడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు,కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ ఆయిల్ ను రాసి కాపడం పెట్టుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. జలుబు చేసినప్పుడు నీటిలో ఈ ఆయిల్ ను వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల జలుబు నుండి త్వరగా బయటపడవచ్చు.