బొప్పాయి చెట్టు భాగాలతో ఈ అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు

బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది మొత్తం ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయి. అంతే కాదు, ఇవి మనకు తక్కువ ధరలకే లభిస్తాయి. అందువల్ల ఈ పండ్లను చాలా మంది తినవచ్చు. అయితే కేవలం బొప్పాయి పండ్లు మాత్రమే కాదు..  దానికి సంబంధించిన పువ్వు, కాండం, విత్తనాలు, ఆకులు.. అన్ని భాగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి వల్ల మనం పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

papaya plant stem flower leaves benefits in telugu

* బొప్పాయి పువ్వును బాగా న‌లిపి దాన్ని పేస్ట్‌లా చేయాలి. దాన్ని పేను కొరికిన చోట రుద్దాలి. దీంతో అక్క‌డ వెంట్రుక‌లు  తిరిగి ఉద్భవిస్తాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఈ విధంగా చేయాలి. దీంతో రాలిపోయిన వెంట్రుకలు మళ్లీ వస్తాయి.

* బొప్పాయి చెట్టు కాండానికి చిన్నగా గాటు పెడితే చాలు, అందులోంచి పాలు వ‌స్తాయి. ఆ పాల‌ను సేకరించి చ‌ర్మంపై రాయాలి. దీంతో తామ‌ర‌, గ‌జ్జి వంటి చ‌ర్మ  స‌మ‌స్య‌ల నుంచి బయట పడవచ్చు.

* బొప్పాయి కాండం నుంచి తీసే పాల‌ను 60 చుక్క‌లుగా సేకరించాలి. వాటికి అంతే మొత్తంలో చ‌క్కెర  కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 3 పూట‌లా తీసుకోవాలి. ఈ క్రమంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం తదితర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* బొప్పాయి పాల‌ను సేకరించి నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుండాలి. దీంతో లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.

* బొప్పాయి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటికి చిన్నగా గాటు పెడితే వాటి నుంచి పాలు వ‌స్తాయి. వాటిని ఒక పాత్ర‌లో సేక‌రించాలి. అనంతరం ఆ పాత్ర‌ను బాగా కాల్చిన ఇసుక‌పై ఉంచాలి. దీంతో ఆ పాలు తెల్ల‌ని చూర్ణంలా మారుతాయి. ఈ చూర్ణాన్ని  సేకరించి నిల్వ చేసుకోవాలి. దాన్ని రోజుకు 2 సార్లు చిటికెడు మోతాదులో తీసుకుని దాన్ని చ‌క్కెర లేదా పాల‌తో తినాలి. దీంతో జీర్ణ‌శక్తి  రెట్టింపవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

* తేలు కుట్టిన చోట బొప్పాయి పాలు రాయాలి. దీంతో తేలు విషం హ‌రించుకుపోతుంది.

* బాలింత‌లు బొప్పాయి ప‌చ్చికాయ‌ను కూరలా వండుకుని తినాలి. దీంతో వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అయితే వైద్యుల సూచన మేరకు ఈ చిట్కా పాటిస్తే మేలు.

* బొప్పాయి ఆకును బాగా నూరి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని క‌ట్టు క‌డుతుంటే బోద‌కాలు సమస్య నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts