కుక్క కాటు గాయం అయిందా.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

కుక్క కాటు ప్రాణాంత‌కం. కుక్క క‌రిస్తే.. వెంటనే వైద్యున్ని క‌లిసి చికిత్స తీసుకోవాలి. ఆల‌స్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. కుక్క‌లు క‌రిచిన వెంట‌నే ప్ర‌థ‌మ చికిత్స చేసుకుని వైద్యున్ని సంప్ర‌దించాలి. చికిత్స తీసుకోవాలి. ఈ క్ర‌మంలో వైద్యులు సూచించే మందుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడాలి. అలాగే కింద సూచించిన చిట్కాల‌ను పాటిస్తే.. గాయం త్వ‌ర‌గా మానేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇన్‌ఫెక్ష‌న్ కూడా రాదు. మ‌రి చిట్కాలు ఏమిటంటే…

dog bite treatment in telugu

* కొన్ని వేప ఆకుల‌ను తీసుకుని బాగా న‌లిపి వాటిని డైరెక్ట్‌గా అలాగే గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. లేదంటే ఆ మిశ్ర‌మంలో కొద్దిగా క‌ల‌బంద గుజ్జును క‌లిపి కూడా గాయానికి రాసి క‌ట్టు క‌ట్ట‌వ‌చ్చు. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది. వేపాకుల్లో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ‌యోటిక్ గుణాలు గాయాన్ని త్వ‌ర‌గా మానేలా చేస్తాయి.

* కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల్ని న‌లిపి గుజ్జుగా చేయాలి. అందులో క‌ల‌బంద గుజ్జు లేదా కొబ్బ‌రి నూనెను కొద్దిగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం మానుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ కాకుండా ఉంటుంది.

* జీల‌క‌ర్ర‌ను పొడిగా చేసి అందులో కొంత నీరు క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో కుక్క కాటు గాయం త్వ‌ర‌గా మానుతుంది. జీల‌క‌ర్ర‌లో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు గాయాన్ని త్వ‌ర‌గా మానుస్తాయి.

* కొద్దిగా ఇంగువను తీసుకుని పొడిగా చేసి దాన్ని గాయంపై చల్లి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది.

* క‌ల‌బంద గుజ్జు కొద్దిగా తీసుకుని దాన్ని గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది.

* ప‌సుపులో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ‌యోటిక్ గుణాలు ఎలాంటి గాయాన్నయినా త్వ‌ర‌గా త‌గ్గించ‌గ‌ల‌వు. కొద్దిగా ప‌సుపు తీసుకుని గాయంపై రాసి క‌ట్టు క‌ట్టాలి. దీంతో గాయం త్వ‌ర‌గా మానుతుంది.

Admin

Recent Posts