అధికంగా బరువు ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. వాటితోపాటు కింద తెలిపిన పలు వంట ఇంటి మసాలా దినుసులను కూడా రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ దినుసులు ఏమిటంటే..
1. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో శరీరాన్ని పసుపు వెచ్చగా ఉంచుతుంది. మెటబాలిజంను పెంచుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రోజూ పసుపు వేసి మరిగించిన నీటిని తాగుతుండాలి. లేదా రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగుతుండాలి. దీంతో బరువు తగ్గుతారు.
2. దాల్చిన చెక్కను అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను దాల్చిన చెక్క కలిగి ఉంటుంది. రోజూ ఉదయాన్నే కొద్దిగా దాల్చిన చెక్ పొడి వేసి నీటిని మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. అధిక బరువును తగ్గించడంలో సోంపు గింజలు కూడా బాగానే పనిచేస్తాయి. భోజనం చేసిన అనంతరం రోజుకు మూడు పూటలా కొద్దిగా సోంపును నోట్లో వేసుకుని నములుతుండాలి. లేదా సోంపు గింజలను వేసి మరిగించిన నీటిని రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. దీంతో బరువు తగ్గుతారు.
4. జీలకర్రను రాత్రి పూట రెండు టీస్పూన్లు తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగాలి. లేదా జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. బరువు తగ్గుతారు.
5. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే బరువు తగ్గుతారు.
6. రెండు యాలకులను దంచి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రి పూట నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు.
7. గ్రీన్ టీని మరిగించే సమయంలో కొద్దిగా మిరియాల పొడి వేసి టీని మరిగించి అనంతరం ఆ టీని తాగాలి. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. బరువును తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365