Rice And Aloe Vera For Hair : షాంపులో ఈ రెండు పదార్థాలు కలిపి వాడితే చాలు.. మన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ రెండు పదార్థాలు కూడా మనకు సలుభంగా దొరికేవే. అలాగే వీటిని వాడడం వల్ల జుట్టు కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. చుండ్రుతో పాటు తలలో ఉండే ఇతర ఇన్ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. షాంపులో కలిపి వాడాల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కలబంద గుజ్జును అలాగే బియ్యం కడిగిన నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత బియ్యాన్ని వడకట్టుకుని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, మన జుట్టుకు సరిపడా షాంపును వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. తరువాత వేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. దీనిని జుట్టుపై 10 నిమిషాల అలాగే ఉంచి తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. బియ్యం కడిగిన నీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే కలబంద గుజ్జులో పోషకాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా ఉంటాయి. జుట్టు కుదళ్లను బలపరచడంతో పాటు చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో దోహదపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.