Sega Gaddalu : సెగ గడ్డలు.. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మందే ఉంటారు. ఈ సెగ గడ్డలు పక్వానికి రాక నొప్పితో బాధపడుతూ ఉంటారు. వేడి శరీరతత్వం ఉన్న వారు చాలా మంది తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
సెగ గడ్డలను తగ్గించడంలో మనకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబందను ఉపయోగించి సెగ గడ్డల సమస్య నుండి ఎలా బయటపడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద చెట్టు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సెగగడ్డలతో బాధపడే వారు ఆరోగ్యంగా ఉన్న కలబంద ఆకును తీసుకుని దానికి ఒక వైపు పొట్టును తీయాలి.
లోపల ఉండే కలబంద గుజ్జుపై కొద్దిగా పసుపును, ఉప్పును కలిపి సెగ గడ్డలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల సెగ గడ్డలు త్వరగా పక్వానికి వచ్చి పగిలి బాధ తగ్గుతుంది. ఈ విధంగా చేయడం వల్ల నొప్పి తగ్గి సెగ గడ్డలు చాలా త్వరగా మానుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.