Teeth : మన దంతాలు చూడడానికి చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కని చిరునవ్వును సొంతం చేసుకున్న వాళ్లం అవుతాం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది దంతాలు గారపట్టడం అనే సమస్యతో బాధపడుతున్నారు. దంతాలు పచ్చగా, దంతాలపై పసుపు చేరినట్టు ఉంటే దంతాలకు గార పట్టింది అని అర్థం. దంతాల వరుస చక్కగా ఉన్నప్పటికీ దంతాలు గార పట్టినట్టు ఉంటే అందరిలోనూ మాట్లాడడానికి, నవ్వడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య కారణంగా ఆత్మ విశ్వాసం కోల్పోయే వారు కూడా ఉన్నారు. చిన్న చిట్కాను ఉపయోగించి చాలా సులభంగా మనం మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
దంతాలపై ఉండే గారను తొలగించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మనం అల్లం ముక్కను, నిమ్మకాయను, ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి జార్ లో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ అల్లం మిశ్రమంలో ఒక చిటికెడు ఉప్పును, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుంటూ దంతాలపై బాగా రుద్ది తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల దంతాలపై ఉండే గార తొలగిపోతుంది. దీంతోపాటు దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి. దంతాలు ఎక్కువ పచ్చగా ఉన్నవారు ఈ చిట్కాను రోజుకు రెండు పూటలా పాటించాలి. అదే సమస్య తక్కువగా ఉంటే.. ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకసారి పాటిస్తే సరిపోతుంది. ఈ చిట్కాలో ఉపయోగించే అల్లం, నిమ్మరసం, ఉప్పు దంతాలను తెల్లగా మార్చడమే కాకుండా దంతాల సమస్యలను కూడా తొలగిస్తాయి.
ఈ విధంగా ఈ చిన్న చిట్కాను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చులోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దంతాలను తెల్లగా, ఆరోగ్యంగా మార్చుకుని.. చక్కని చిరునవ్వును మనం సొంతం చేసుకోవచ్చు.