Black Hair : పాతికేళ్ల వయస్సు రాకముందే జుట్టు తెల్లబడడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైపోయింది. కారణాలు ఏవైనప్పటికీ ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల చూడడానికి పెద్ద వారిలా కనబడతున్నారు. కేవలం ఇంటి చిట్కాను ఉపయోగించి తెల్లజుట్టును మనం నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఇది ఒక 3 ఇన్ 1 చిట్కా అని చెప్పవచ్చు. జుట్టు సమస్యలను తగ్గించడంతోపాటు తెల్ల జుట్టును నల్లగా మార్చే ఇంటి చిట్కా ఏమిటి.. ఈ చిట్కాను ఏవిధంగా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్య ఉన్న వారు ఈ చిట్కాను వాడి జుట్టును అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ టీ పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల బాదం నూనెను, ఒక టీ స్పూన్ డెటాల్ ను, ఒక టేబుల్ స్పూన్ నీళ్లను వేసి కలపాలి.
తరువాత ఈ గిన్నెను నీళ్లు ఉన్న మరో గిన్నెలో ఉంచి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల డికాషన్ తయారవుతుంది. డికాషన్ తయారయిన తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. వడకట్టగా వచ్చిన డికాషన్ నీటిలో దూదిని ముంచి ఆ దూదితో డికాషన్ ను తీసుకుంటూ జుట్టుకు, జుట్టు కుదుళ్లకు రాయాలి. ఇలా రాసిన తరువాత 5 నిమిషాల పాటు తలపై సున్నితంగా మర్దనా చేయాలి. తరువాత 30 నుండి 40 నిమిషాల పాటు ఉండి చల్లటి నీటితో అదే విధంగా రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే అలాగే చాలా తక్కువ ఖర్చులోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలా మంది హెయిర్ డై లను ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది. అదే విధంగా వీటిని వాడడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ చిట్కాను వాడడం వల్ల సహజసిద్ధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.