Sprouts For Hair Growth : జుట్టును వేగంగా పెంచే మొల‌క‌లు ఇవి.. రోజూ తినాలి..!

Sprouts For Hair Growth : మ‌న‌లో చాలా మందిని వేధించే స‌మ‌స్య‌ల‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. అలాగే వంశ‌పార‌పర్యంగా కూడా కొంద‌రిలో జుట్టు రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌స్తూ ఉంటుంది.అయితే మ‌న‌కు రోజుకు దాదాపు 100 వెంట్రుక‌ల వ‌ర‌కు జుట్టు రాలిఊడిపోయి మ‌ర‌లా వ‌స్తూ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోయిన‌ స్థానంలో మ‌ర‌లా అంతే మొత్తంలో కొత్త వెంట్రుక‌లు వ‌స్తే ఎటువంటి స‌మ‌స్య ఉండ‌దు. ఊడిపోయే జుట్టు ఎక్కువ‌గా వ‌చ్చేజుట్టు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల జుట్టు ప‌లుచ‌బ‌డుతుంది. వ‌య‌సు పైబ‌డే కొద్ది కొంద‌రిలో జుట్టు ఊడిపోవ‌డ‌మే త‌ప్ప మ‌ర‌లా రానే రాదు.

ఒక్క‌సారి బ‌ట్ట‌త‌ల వ‌స్తే మ‌ర‌లా మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా లేదా స‌హ‌జ సిద్ద ప‌ద్ద‌తిలో ఆ స్థానంలో కొత్త వెంట్రుక‌ల‌ను వ‌చ్చేలా చేయ‌లేము. క‌నుక మ‌నం బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌డ‌మే ఉత్త‌మం. జుట్టు ఎక్కువ‌గా ఊడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అలాగే కొత్త జుట్టు రాక‌ప‌సోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుంటే ఈ స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. జుట్టు ఎక్కువ‌గా ఊడిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డానికి గ‌ల కార‌ణాల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చుండ్రు కార‌ణంగా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. క‌నుక చుండ్రు స‌మ‌స్య మ‌న‌ ద‌రి చేర‌కుండా చూసుకోవాలి. చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ త‌ల‌స్నానం చేయాలి.

Sprouts For Hair Growth take daily for many benefits
Sprouts For Hair Growth

త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు చేతి గోర్ల‌తో త‌ల‌చ‌ర్మాన్ని బాగా రుద్దుతూ త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. దీంతో జుట్టు రాల‌కుండా ఉంటుంది. అలాగే శ‌రీరంలో ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుంది. ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌హీనప‌డి ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటాయి. క‌నుక ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో సోయా బీన్స్ కూడా ఒక‌టి. సోయాబీన్స్ గింజ‌ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ ల‌భిస్తుంది. అలాగే మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ అందుతుంది.

పెస‌ర్లు, అల‌సంద‌లు, శ‌న‌గ‌లు వంటి వాటిని మొల‌కలుగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ప్రోటీన్ ల‌భిస్తుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఊడిన జుట్టు స్థానంలో మ‌ర‌లా కొత్త జుట్టు వ‌స్తుంది. అలాగే రోజూ మ‌ధ్యాహ్నం ఆకుకూర‌ను తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌కుండా ఉంటుంద‌ని బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. స‌మ‌స్య వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డానికి బ‌దులుగా స‌మ‌స్య రాకుండా చూసుకోవ‌డ‌మే మంచిద‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts