Stomach Worms : పొట్ట‌లోని పాములు, పురుగుల‌ను సుల‌భంగా బ‌య‌ట‌కు తెచ్చే టెక్నిక్‌.. ఇలా చేయాలి..!

Stomach Worms : నులి పురుగులు.. మ‌న‌ల్ని వేధించే స‌మ‌స్య‌ల్లో ఇవి కూడా ఒక‌టి. ఎక్కువ‌గా పిల్ల‌ల్లో వీటిని మ‌నం చూస్తూ ఉంటాము. ఇవి మ‌న ప్రేగుల్లో నివాసం ఉండడం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. పొట్ట‌లో నులిపురుగులు ఉండ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి వ‌స్తుంది. అలాగే క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం, తిన్న ఆహారం వంటికి ప‌ట్ట‌క‌పోవ‌డం, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో ఉండ‌డం, అలాగే క‌లుషిత‌మైన నీరు, ఆహారాన్ని తీసుకోవ‌డం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త లేక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ప్రేగుల్లో నులిపురుగులు త‌యార‌వుతాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రేగుల్లో ఉండే నులిపురుగుల‌ను తొల‌గించే ప్ర‌యత్నం చేయాలి.

లేదంటే మ‌నం తీవ్ర అస్వ‌స్థ‌కు గురి కావాల్సి వ‌స్తుంది. అయితే నులిపురుగుల‌ను నివారించే మందులు మ‌న‌కు మార్కెట్ లో ల‌భిస్తాయి. అయితే మందులు వాడ‌కుండా స‌హ‌జ సిద్దంగా కూడా మ‌నం నులిపురుగుల‌ను తొల‌గించుకోవ‌చ్చు. దీనికోసం మ‌నం ఎనీమా చేసుకోవాల్సి ఉంటుంది. సాధార‌ణ నీటితో చేసుకోద‌గిన ఎనీమా కిట్స్ మ‌న‌కు మెడిక‌ల్ షాపుల్లో ల‌భిస్తూ ఉంటాయి. ఉద‌యం పూట క‌డుపు ఖాళీగా ఉన్న స‌మ‌యంలో ఎనీమా బాటిల్ గోరు వెచ్చ‌ని నీటిని పోసి బాటిల్ ను ఎత్తులో ఉంచాలి. పైపులో ఉండే గాలి అంతా పోయి నీరు చేరిన త‌రువాత దానికి ఉండే నాజిల్ ను మ‌ల‌ద్వారంలో ఉంచి ప‌క్కకు తిరిగి ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల నీరంతా మ‌ల‌ద్వారంలోకి ప్ర‌వేశిస్తుంది.

Stomach Worms easy and effective home remedies
Stomach Worms

ఇలా చేసిన 10 నుండి 15 నిమిషాల్లో ప్రేగుల్లో ఉండే మ‌లం అంతా తొల‌గిపోయి మ‌ల‌ద్వారం శుభ్ర‌ప‌డుతుంది. ఇలా రెండు రోజుల పాటు చేసుకున్న త‌రువాత మూడో రోజు వేపాకుల నీటితో ఎనీమా చేసుకోవాలి. దీని కోసం ఒక లీట‌ర్ నీటిలో గుప్పెడు వేపాకుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో కొద్దిగా ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ నీరు గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత వీటిని ఎనీమా డ‌బ్బాలో పోసుకుని ఎనీమా చేసుకోవాలి. ఇలా మూడు రోజుల పాటు చేసుకోవ‌డం వ‌ల్ల ప్రేగులు శుభ్ర‌ప‌డ‌డంతో పాటు ప్రేగుల్లో ఉండే మ‌లం తొల‌గిపోతుంది. అలాగే ప్రేగుల్లో ఉండే నులిపురుగుల‌తో పాటు ఇత‌ర ర‌కాల పాములు కూడా తొల‌గిపోతాయి.

పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్దల వ‌ర‌కు ఎవ‌రైనా ఇలా ఎనీమాను చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా నులి పురుగుల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ స‌మ‌స్య భ‌విష్య‌త్తులో రాకుండా ఉండాలంటే ప్రేగులు శుభ్రంగా ఉండాలి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య లేకుండా చూసుకోవాలి. ప్రేగులు శుభ్రంగా ఉండ‌డం వ‌ల్ల మంచి చేసే బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. నులిపురుగులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. అలాగే వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించాలి. చేతులు క‌డిగిన త‌రువాతే భోజ‌నం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నులిపురుగుల స‌మ‌స్య మ‌ర‌లా రాకుండా ఉంటుంది. ఈ విధంగా స‌హ‌జ సిద్దంగా ఎటువంటి మందులు లేకుండా మ‌నం నులిపురుగుల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts