Dragon Fruit Milkshake : డ్రాగ‌న్ ఫ్రూట్‌తో ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dragon Fruit Milkshake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో డ్రాగ‌న్ ఫ్రూట్ కూడా ఒక‌టి. డ్రాగ‌న్ ఫ్రూట్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇలా అనేక రకాలుగా డ్రాగ‌న్ ఫ్రూట్ మ‌న‌కు సహాయ‌ప‌డుతుంది. ఈ పండుతో మ‌నం వేస‌వి నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించేలా అలాగే ఆరోగ్యాన్ని పొందేలా చ‌క్క‌టి మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు.ఈ మిల్క్ షేక్ ను కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. డ్రాగ‌న్ ఫ్రూట్ తో రుచిగా , క‌మ్మ‌గా, చ‌ల్ల చ‌ల్ల‌టి మిల్క్ షేక్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రాగ‌న్ ఫ్రూట్ మిల్క్ షేక్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

డ్రాగ‌న్ ఫ్రూట్ – 1, పంచ‌దార – 3 టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 5, వెనీలా ఐస్ క్రీమ్ – 2 స్కూబ్స్, కాచి చ‌ల్లార్చిన పాలు – 100 ఎమ్ ఎల్.

Dragon Fruit Milkshake recipe in telugu drink it cool
Dragon Fruit Milkshake

డ్రాగ‌న్ ప్రూట్ మిల్క్ షేక్ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో డ్రాగ‌న్ ఫ్రూట్ ముక్క‌ల‌ను వేసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ ఒక గ్లాస్ లో పోసి చ‌ల్ల చ‌ల్ల‌గా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రాగ‌న్ ఫ్రూట్ మిల్క్ షేక్ త‌యారవుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వేసవికాలంలో ఇలా డ్రాగ‌న్ ప్రూట్ తో మిల్క్ షేక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది.

D

Recent Posts