Stomach Worms In Kids : మీ పిల్ల‌ల పొట్ట‌లో నులిపురుగులు, పాములు పోయే సింపుల్ రెమెడీస్‌..!

Stomach Worms In Kids : కొంత మంది పిల్ల‌లు ఎప్పుడూ చూసిన స‌న్న‌గా, పాలిపోయిన‌ట్టు, నీర‌సంగా క‌నిపిస్తూ ఉంటారు. అలాగే వారిలో ర‌క్తం కూడా త‌గ్గిపోయి బ‌ల‌హీనంగా క‌నిపిస్తూ ఉంటారు.స‌రైన ఆహారం ఇచ్చిన‌ప్ప‌టికి పిల్ల‌లు ఇలా క‌నిపిస్తూ ఉంటారు. ఇలా పిల్ల‌లు బ‌ల‌హీనంగా క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాల్లో క‌డుపులో నులిపురుగులు కూడా ఒక‌టి. పొట్ట‌లో నులిపురుగులు ఉండ‌డం వ‌ల్ల కూడా పిల్లలు ఇలా నీర‌సంగా అయిపోతూ ఉంటారు. పిల్ల‌ల ర‌క్తాన్ని తాగుతూ వారికి ఇచ్చే ఆహారంలో ఉండే సారానిఅంతా తినేస్తూ ఉండ‌డం వ‌ల్ల పోష‌కాలు అంద‌క పిల్లలు బ‌ల‌హీనంగా అవుతూ ఉంటారు. పిల్ల‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా ప్రేగుల్లో మ‌లం పేరుకుపోయి చెడు వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

ఇలాంటి స‌మ‌యంలో నులిపురుగుల‌కు సంబంధించిన గుడ్లు మ‌నం తీసుకునే ఆహారం ద్వారా, చేతుల ద్వారా, గోల ద్వారా పొట్ట‌లోకి వెళ్ల‌డం వ‌ల్ల‌ ఆ వాతావ‌ర‌ణానికి గుడ్లు కాస్త పురుగులుగా మార‌తాయి. అలాగే కొన్ని ర‌కాల పురుగులు వాటంత‌ట అవే పొట్ట‌లో పుడ‌తాయి. పొట్ట‌లో అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌డం వ‌ల్ల, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కార‌ణంగా ఇలా జ‌రుగుతుంది. పొట్ట‌లో పురుగులు ఉండ‌డం వ‌ల్ల పిల్లల్లో ఎదుగుద‌ల కూడా త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వారిని వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డేయాలి. స‌హ‌జ ప‌ద్ద‌తుల్లో కూడా పొట్ట‌లో ఉండే నులిపురుగుల‌ను తొల‌గించ‌వ‌చ్చు. అలాగే మ‌ర‌లా ఈ పురుగులు రాకుండా చేయ‌వ‌చ్చు. దీనికోసం మ‌న‌కు పిల్ల‌లు ఎనీమా చేయాలి. ప్లాస్టిక్ ఎనీమా బాటిల్ ను తీసుకుని అందులో గోరు వెచ్చని నీటిని పోయాలి. త‌రువాత నాజిల్ కు కొబ్బ‌రి నూనె రాసి పిల్ల‌ల‌కు ఎనీమా చేయాలి. ఎనీమా చేయ‌డం వ‌ల్ల మ‌ల‌విస‌ర్జ‌న సుల‌భంగా అవుతుంది.

Stomach Worms In Kids wonderful home remedies
Stomach Worms In Kids

ప్రేగుల్లో పేరుకుపోయిన మ‌లం అంతా తొల‌గిపోతుంది. ప్రేగుల్లో చెడు వాతావ‌ర‌ణం ఉండ‌దు. ఇలా రెండు రోజులు చేసిన త‌రువాత నీటిలో వేపాకుల‌ను వేసి మ‌రిగించాలి. నీళ్లు బాగా మరిగిన త‌రువాత వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఇలా త‌యారు చేసిన వేపాకు నీటితో ఎనీమా చేయాలి. ఇలా 4 రోజుల పాటు చేయాలి. వేపాకుతో ఎనీమా చేయ‌డం వ‌ల్ల ప్రేగుల్లో ఉండే నులిపురుగులు మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో నులిపురుగుల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ స‌మ‌స్య మ‌ర‌లా రాకుండా ఉండాలంటే పిల్ల‌ల‌కు ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను ఇవ్వాలి. నీటిని ఎక్కువ‌గా తాగించాలి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ్యస లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో నులిపురుగుల స‌మ‌స్య తగ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంది.

D

Recent Posts