చిట్కాలు

అధిక బ‌రువును త‌గ్గించే మెంతి ఆకులు.. ఎలా తీసుకోవాలంటే..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో మెంతి ఆకు కూడా ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతి ఆకుతో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మెంతి ఆకుల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. అయితే అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మెంతి ఆకులు అద్భుత వ‌ర‌మని చెప్పవ‌చ్చు. ఎందుకంటే..

take fenugreek leaves to reduce weight

మెంతి ఆకుల్లో గ‌లాక్టోమ‌న్న‌న్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. అందువ‌ల్ల మెంతి ఆకుల‌ను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

మెంతి ఆకుల‌ను రోజూ ఉడికించి తీసుకోవ‌చ్చు. లేదా జ్యూస్ చేసి 10-30 ఎంఎల్ మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌చ్చు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

మెంతి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఇక ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని మెంతుల‌ను వేసి మ‌రిగించి ఆ నీటిని తాగుతున్నా అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మెంతుల‌ను మ‌జ్జిగ‌లో నాన‌బెట్టి తింటే కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts