మిన‌ర‌ల్స్

ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే చాలు.. కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక పోష‌కాల్లో కాల్షియం కూడా ఒక‌టి. ఇది లేక‌పోతే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాల్షియం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఎముక‌ల అభివృద్ధికి కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా కాల్షియం దోహ‌ద‌ప‌డుతుంది. అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో, మెడిసిన్ల‌ను ఎక్కువ‌గా తీసుకునేవారిలో, మ‌హిళ‌ల్లో కాల్షియం లోపం ఏర్ప‌డుతుంటుంది.

follow these simple tips to get rid of calcium deficiency

న‌వ‌జాత శిశువుల్లో, ఎండ ఎక్కువ త‌గ‌ల‌ని వారిలో, మ‌ద్యం అధికంగా సేవించే వారిలోనూ కాల్షియం లోపం స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో ఎముక‌లు పెళుసుగా మారి విరుగుతుంటాయి. దంతాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుంది. అధికంగా జుట్టు రాలుతుంది. ఇవ‌న్నీ కాల్షియం లోపం ఉన్న వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు.

అయితే ప‌లు ర‌కాల ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కాల్షియం లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. సిరి ధాన్యాల‌ను రోజూ తింటే అస‌లు కాల్షియం లోప‌మే రాదు. ఆ లోపం ఉన్నా ప‌రిష్కారం అవుతుంది. సామ‌లు, కొర్ర‌లు, అరికెలు వంటి సిరిధానాల్లో కాల్షియం స‌మృద్ధిగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీంతో దంతాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి.

ఉద‌యాన్నే సిరి ధాన్యాల‌ను బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకుంటే మంచిది. అలాగే వాటితో పాల‌ను కూడా తీసుకోవాలి. పాల‌లో కాల్షియం ఉంటుంది. ఇది కాల్షియం లోపాన్ని త‌గ్గిస్తుంది. ఇక తుల‌సి ఆకులు, తృణ ధాన్యాలను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కాల్షియం లోపం నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

రోజూ ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. క్యాబేజీ, పాల‌కూర వంటి వాటిని తీసుకోవాలి. వాటిల్లో ఐర‌న్ ఉంటుంది. అది ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా చూస్తుంఇ. రోజూ ఆహారంలో ఒక క‌ప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగులోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే గుడ్లు, న‌ట్స్‌ను కూడా ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల కాల్షియం లోపం స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts