చిట్కాలు

మిరియాల‌ను ఇలా తీసుకుంటే ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గుతాయి..!

సాధారణంగా మనం వంటల్లో సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. వీటి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల మిరియాల గురించి చెప్పుకుని తీరాలి. ఆహారానికి మంచి రుచి, వాసన మాత్రమే కాదు దీని వల్ల అనేక సమస్యలని మనం సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన మిరియాలు జలుబు, దగ్గు, గొంతు, ముక్కు ఇలా ఒకటేమిటి అనేక రోగాలకు పరిష్కారం చూపిస్తాయి. ఈ అద్భుతమైన వంటింటి ఔషధం దంత సమస్యలకు కూడా బాగా పరిష్కారం చూపిస్తుంది.

మిరియాలని గోరువెచ్చని పాలల్లో పొడిలా చేసి కొంచెం పసుపు, అర చెంచా తేనె వేసి బాగా కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మిరియాల పొడిలో కొంచెం శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని రెండు రోజులకు ఒకసారి చొప్పున తీసుకుంటే దగ్గు తగ్గి మంచి రిలీఫ్ ని పొందొచ్చు. అధిక కొవ్వుతో బాధపడే వారు మిరియాల రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

take pepper in this way to reduce cold and cough quickly

ఒకవేళ మీకు జలుబు తీవ్రంగా ఉన్నట్లయితే.. కొంచెం మిరియాల కషాయం తాగితే సరిపోతుంది. దీనిని ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. ముందు ఒక స్పూన్ మిరియాల పొడిలో కొద్దిగా అల్లం ముద్ద, గుప్పెడు తులసి ఆకులని ఒక కప్పు నీళ్ల లో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. దానిని ఒక గిన్నె లోకి తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు మాయమైపోతుంది. ఇలా కనుక చేస్తే ఎంతో మంచి ఫలితం కనపడుతుంది. కనుక ఈ పద్దతిని అనుసరించేయండి.

Admin

Recent Posts