ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటి అనేక కారణాల వల్ల మనం అధిక బరువు బారిన పడుతున్నాం. అధిక బరువు కారణంగా మనం ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.
కొందరిలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు. ప్రయత్నాలు చేసి విసిగి పోయిన వారు కూడా ఉంటారు. ఇంటి చిట్కాను ఉపయోగించి సహజసిద్ధంగా చాలా తక్కువ ఖర్చుతోనే ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా చాలా తక్కువ సమయంలోనే మనం బరువు తగ్గవచ్చు. బరువును తగ్గించే ఇంటి చిట్కా ఏమిటి.. దీని తయారీలో ఉపయోగించే పదార్థాల గురించి.. అదే విధంగా ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి.. వంటి తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందుకోసం మనం ఉలవలను, జీలకర్రను, వామును ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలే. వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో జీవక్రియల రేటు పెరగడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గడానికి ఈ పదార్థాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం ముందుగా ఒక కళాయిలో ఉలవలను వేసి వేయించాలి. తరువాత ఒక జార్ లో రెండు టేబుల్ స్పూన్ల వేయించిన ఉలవలను, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, రెండు టేబుల్ స్పూన్ల వామును తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం అల్పాహారానికి అరగంట ముందు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న వారు ఈ పొడిని ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఉపయోగించవచ్చు.
ఈ పొడిని ఉపయోగించినంత కాలం మనం నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అఆగే మనం తాగే నీరు గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఉలవలు వేడి చేసే తత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ చిట్కాను పాటించినంత కాలం చలువ చేసే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.