Teeth Pain Remedies : దంతాలు కూడా మన శరీరంలో భాగమే. వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవ్వడంలో దంతాలు ముఖ్య పాత్ర పోష పోషిస్తాయి. దంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దంతాలు ఆరోగ్యంగానే ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్పకనే చెప్పవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల దంత సమస్యలతో బాధపడుతున్నారు. దంతాలు జివ్వుమనడం, దంతాలు పుచ్చిపోవడం, దంతాల నొప్పులు వంటి అనేక రకాల దంత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఇటువంటి దంత సమస్యల బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి.
దంతాలను శుభ్రపరుచుకోకపోవడం, టీ మరియు కాఫీలను ఎక్కువగా తాగడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, పంచదార కలిగిన పానీయాలను ఎక్కువగా తాగడం, ఐస్ క్రీమ్, చాక్లెట్ వంటి వాటిని తినడం వంటి అనేక కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతాయి. ఇలా సమస్యలు తలెత్తగానే వైద్యులు దంతాలను తీసి వేయడమో, రూట్ కెనాల్ వంటి ఆధునిక పద్దతులను అనుసరించడమో చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఆధునిక పద్దతులను పాటించడానికి బదులుగా కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి మనం ఈ దంతాల నొప్పులను తగ్గించుకోవచ్చు. దంతాల నొప్పులను తగ్గించడంలో మనకు కుప్పింటాకు ఎంతగానో దోహదపడుతుంది. దీనినే పిప్పింటాకు అని కూడా అంటారు.
దంతాల నొప్పులతో, పిప్పి పన్ను సమస్యతో బాధపడే వారు ఈ చెట్టు ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. తరువాత ఈ ఆకులను నోట్లో వేసుకుని మెత్తగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల కూడా అన్ని రకాల దంతాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా దంత సమస్యలను తగ్గించడంలో మేడి చెట్టు పాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. మేడి చెట్టు ఆకులను తుంచగా వచ్చిన పాలను సేకరించి ఆ పాలను దంతాలపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాల నొప్పులు తగ్గుతాయి. అలాగే పిచ్చి మిరప చెట్టు కూడా దంతాల సమస్యలను తగ్గించడంలో మనకు దోహదపడుతుంది. ఈ పిచ్చి మిరప చెట్టు చూడడానికి అచ్చం మిరప చెట్టు లాగే ఉంటుంది. ఈ చెట్టు ఆకులను సేకరించి మెత్తగా నమిలి ఉమ్మి వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
అదేవిధంగా కొండ పిండి ఆకులను మెత్తగా నమిలి ఉమ్మి వేస్తూ ఉండాలి. ఇలా రెండు రోజుల పాటు చేయడం వల్ల దంతాల సమస్యలు తగ్గడంతో పాటు దంతాలు ధృడంగా మారుతాయి. అలాగే త్రిఫల చూర్ణంలో కొద్దిగా ఉప్పును వేసి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా దంతాలు ధృడంగా మారుతాయి. దంతాల సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే కరక్కాయను పొడిగా చేసి అందులో ఉప్పును కలిపి వేలితో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా దంతాల సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల దంతాల సమస్యలు తగ్గడంతో పాటు దంతాలు ధృడంగా మారతాయి. దంత సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు.