Teeth Pain Remedy : ఈ చిట్కాను పాటిస్తే.. దంతాల నొప్పి త‌గ్గుతుంది.. గార‌పోయి దంతాలు మెరుస్తాయి..

Teeth Pain Remedy : మ‌న చ‌క్క‌టి చిరున‌వ్వులో దంతాలు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌న న‌వ్వు అందంగా ఉంటుంది. కానీ ప్ర‌తి ఒక్క‌రి దంతాలు తెల్ల‌గా ఉండ‌వు. అలాగే దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతున్నారు. దంతాల నొప్పులు, దంతాలు పుచ్చిపోవ‌డం, దంతాలు ప‌చ్చ‌గా మార‌డం, దంతాలు వ‌దులుగా మార‌డం వంటి అనేక దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. దంతాల స‌మ‌స్య‌ల‌ను తగ్గి దంతాలు ఆరోగ్యంగా, తెల్ల‌గా ఉండాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటారు.

ఎన్ని ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడినా ఫ‌లితం లేక ఇబ్బంది ప‌డే వారు ఇంటి చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దంత స‌మ‌స్య అయినా త‌గ్గు ముఖం ప‌డుతుంది. దంతాల‌ను ఆరోగ్యంగా, తెల్ల‌గా, అందంగా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని పేస్ట్ గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ను లేదా అర టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి క‌లపాలి. చివ‌ర‌గా ఇందులో ఒక టీ స్పూన్ ఆవ నూనెను లేదా అర టీ స్పూన్ ల‌వంగం నూనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని నొప్పి ఉన్న దంతాల‌పై 10 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.

Teeth Pain Remedy in telugu follow regularly
Teeth Pain Remedy

దంతాలు వ‌దుల‌వ‌డం, దంతాలు ప‌చ్చ‌గా మార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్ తో తీసుకుని దంతాల‌ను 2 నిమిషాల పాటు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పులు, దంతాల‌పై ఉండే గార తొలిగిపోతుంది. ఈ విధంగా వెల్లుల్లి మిశ్ర‌మంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా న‌శిస్తాయి. నోటి దుర్వాస‌న స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల దంతాల స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చ‌క్క‌టి అంద‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన దంతాల‌ను మ‌న సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts