Tooth Decay Pain : ఇలా చేస్తే పిప్పి ప‌న్ను నొప్పి వెంటనే త‌గ్గుతుంది.. ఇది రోజుకు 4 సార్లు వాడాలి..!

Tooth Decay Pain : మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలో దంతాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆహారాన్ని స‌రిగ్గా న‌మిలిన‌ప్పుడే మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దంతాల‌కు ఎటువంటి స‌మ‌స్య లేకుండా, అవి ఆరోగ్యంగా ఉన్నంత వ‌ర‌కు మాత్ర‌మే అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌గ‌లం. దంతాల‌లో ఇన్ఫెక్ష‌న్లు, దంతాలు పుచ్చి పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు నొప్పి తీవ‌త్ర చాలా అధికంగా ఉంటుంది. పిప్పి ప‌న్ను నొప్పి, ఇన్ ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దంతాలు పాడైపోయినా లేదా పుచ్చినా వాటిని మ‌నం తిరిగి బాగు చేయ‌లేము. కానీ దంతాల‌కు వ‌చ్చే ఇన్ ఫెక్ష‌న్ల‌ల‌ను మాత్రం మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు.

Tooth Decay Pain follow this simple remedy
Tooth Decay Pain

స‌హ‌జ సిద్దంగా కూడా పిప్పి ప‌న్ను నొప్పిని, ఇన్ ఫెక్ష‌న్ ను మ‌నం త‌గ్గించుకోవ‌చ్చు. పిప్పి ప‌న్ను మీద లేదా పిప్పి వ‌ల్ల క‌లిగిన గుంత భాగంలో తేనె చుక్క‌ల‌ను వేయ‌డం వ‌ల్ల పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి నుండి, ఇన్ ఫెక్ష‌న్ నుండి మ‌నం ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. తేనె యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను అధికంగా క‌లిగి ఉంటుంది. పిప్పి ప‌న్ను మీద ఇలా తేనెను రోజుకు 4 నుండి 5 సార్లు వేయ‌డం వ‌ల్ల నొప్పి, ఇన్ ఫెక్ష‌న్ త‌గ్గుతాయి. అంతే కాకుండా దంతాలు నొప్పిగా ఉన్న‌ప్ప‌డు తేనెతో బ్ర‌ష్ చేసుకోవ‌డం వ‌ల్ల దంతాల నొప్పులు త‌గ్గుతాయి. రోజుకి రెండు సార్లు తేనెతో బ్ర‌ష్ చేయ‌డం వ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్స్, బాక్టీరియా కార‌ణంగా వ‌చ్చే నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

అంతే కాకుండా పిప్పి నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం, పిప్పి ప‌న్ను వల్ల క‌లిగే వాపు నుండి ఉప‌హ‌వ‌నం పొంద‌డాద‌నికి నొప్పిని త‌గ్గించే మందుల‌ను వాడ‌కుండా వేడి నీటిలో తేనె, నిమ్మ ర‌సాన్ని క‌లుపుకుని తాగుతూ ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల కూడా నొప్పి, వాపు, ఇన్ ఫెక్ష‌న్స్ త‌గ్గుతాయి. పిప్పి ప‌న్ను వల్ల వాపు ఉన్న‌ప్పుడు వేడి నీటితో కాప‌డం వ‌ల్ల వాపు త‌గ్గుతుంది. తేనెతో ఈ విధంగా చేయ‌డం వల్ల పిప్పి ప‌న్ను నొప్పి, వాపు, ఇన్ ఫెక్ష‌న్స్ త‌గ్గుతాయి. దీని కోసం నాణ్య‌మైన తేనెను మాత్ర‌మే వాడాలి. అప్పుడే ఫ‌లితం అధికంగా ఉంటుంది. నొప్పి తీవ్ర‌త మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌వారు వైద్యుడిని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Share
D

Recent Posts