Tulsi Leaves On Empty Stomach : రోజూ ఖాళీ క‌డుపుతో తుల‌సి ఆకుల‌ను ఈ 7 విధాలుగా తీసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..?

Tulsi Leaves On Empty Stomach : మ‌నం ఎంతో ప‌విత్రంగా పూజించే మొక్క‌ల‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఎంతో ప్ర‌ధాన్య‌త ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా తుల‌సి మొక్క‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. దీనిలో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో తుల‌సి మొక్క‌ను ఉప‌యోగించి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తూ ఉంటారు. అయితే తుల‌సి ఆకుల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గడుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని వారు తెలియజేస్తున్నారు.

రోజూ ప‌ర‌గడుపున తుల‌సి ఆకుల‌ను ఏవిధంగా తీసుకోవాలి.. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ నీటిలో తుల‌సి ఆకుల‌తో పాటు ఒక టీ స్పూన్ తేనె వేసి క‌లిపి ప‌ర‌గడుపున తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మస్య‌లు త‌గ్గుతాయి. ఈ నీటిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారి శ‌క్తివంతంగా త‌యార‌వుతారు. ప‌ర‌గడుపున తుల‌సి ఆకుల‌ను న‌మిలి తిన‌డం ఎంతో మంచిది. తుల‌సిలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ డిప్రెసెంట్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. రోజూ తుల‌సి ఆకుల‌ను న‌మిలి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Tulsi Leaves On Empty Stomach here are 7 ways how you can take them
Tulsi Leaves On Empty Stomach

ఇన్పెక్ష‌న్ లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే మ‌నం త‌యారు చేసుకునే హెర్బ‌ల్ టీల‌లో, సాధార‌ణ టీ ల‌లో కూడా తుల‌సి ఆకులు వేసి మ‌రిగించి తీసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. తుల‌సి ఆకుల నుండి మ‌రిన్నిప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే వాటిని పొడిగా చేసి వాడుకోవ‌డం మంచిది. గోరువెచ్చ‌ని నీటిలో తుల‌సి ఆకుల పొడి వేసి క‌లిపి తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి. అలాగే తుల‌సి ఆకుల ర‌సాన్ని తీసి ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల గొంతునొప్పి త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీర బ‌రువు కూడా అదుపులో ఉంటుంది.

అదే విధంగా తుల‌సి ఆకుల‌ను, పుదీనా ఆకులను నీటిలో వేసి ఉడికించాలి. త‌రువాత ఈ నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఉద‌యం పూట చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇలా నీటిని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ పెరుగుతుంది. శ‌రీరంలో అద‌నంగా ఉన్న కొవ్వు కూడా క‌రుగుతుంది. అదే విధంగా రోజూ రాత్రి ప‌డుకునే ముందు గ్లాస్ నీటిలో తుల‌సి ఆకులు వేసి రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తీసుకోవాలి. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ విధంగా తుల‌సిఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని రోజూ ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts